మెదక్ మున్సిపాలిటీ, డిసెంబర్ 14 : మెదక్ జిల్లా రామాయంపేట మండలంలోని కోనాపూర్ గ్రామంలో మాజీ డిప్యూటీ స్పీకర్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగిం చుకున్నారు. రెండో విడుత సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో ఆదివారం కోనాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రం వద్ద కుటుంబ సభ్యులకు కలసి వచ్చి ఓటు హక్కును పద్మ దేవేందర్ రెడ్డి వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందని ఆరోపించారు.
బీఅర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను భయభ్రాంతులకు గురి చేస్తుందని అన్నారు. కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం పోలీస్ యంత్రాంగం పనిచేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార కాంగ్రెస్ పార్టీ ఎన్ని అడ్డంకులు సృష్టించిన బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పోలీసులు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ఇళ్లల్లో బంధించి, కాంగ్రెస్ నాయకులు డబ్బు మద్యం పంపిణీ చేసే విధంగా సహకరించారని పద్మా దేవేందర్ రెడ్డి ఆరోపించారు.