బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పైన దుష్ప్రచారం చేసే విధంగా పోలీసులకు సీఎం రేవంత్‌రెడ్డి స్రిప్ట్ ఇచ్చారని కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీప్రసాద్ ఆరోపించారు. ఆ కుట్రలో భాగంగా సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారని విమర్శించారు. సిట్ విచారణపై కాంగ్రెస్‌కు నమ్మకం ఉంటే నిర్ధారణలు గాంధీభవన్‌లో ఎట్లా జరుగుతాయని ప్రశ్నించారు.
సిట్ చీఫ్ సజ్జనారా? మహేశ్కుమార్గౌడా? అని నిలదీశారు. సాక్షులను నిందితులుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్ని సిట్లు వేసినా బీఆర్ఎస్ పార్టీని ఏమీ చేయలేరని స్పష్టంచేశారు. కేసీఆర్‌కు నోటీసులు ఇవ్వడం అంటే తెలంగాణ ప్రజలను ఆవమానించడమేనని పునరుద్ఘాటించారు.