రేవంత్‌రెడ్డే ‘పాపాల భైరవుడు’
ఆదివారం నల్లగొండ సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు పూర్తిగా రాజకీయ దిగజారుడుతనానికి, ఆయన పరిపాలనా వైఫల్యాలకు నిదర్శనమని బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉప నేత పీ సబితాఇంద్రారెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
- ఆయన తీరు.. సీఎం పదవికే అవమానం
- చౌకబారు డ్రామాలాపి.. హామీలపై దృష్టిపెట్టు
- బీఆర్ఎస్ మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి ధ్వజం
హైదరాబాద్, జూన్ 29(నమస్తే తెలంగాణ) : ఆదివారం నల్లగొండ సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు పూర్తిగా రాజకీయ దిగజారుడుతనానికి, ఆయన పరిపాలనా వైఫల్యాలకు నిదర్శనమని బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉప నేత పీ సబితాఇంద్రారెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేసీఆర్‌ను విమర్శించే అర్హత రేవంత్‌రెడ్డికి లేదని, అసలైన ‘పాపాల భైరవుడు’ రేవంతేనని ఆమె తిప్పికొట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను సోమవారం ఒక ప్రకటనలో ఎండగట్టారు. ఇచ్చిన హామీల అమలు చేయలేక, చేతకానితనాన్ని కప్పిపుచ్చుకొనేందుకే ప్ర తిపక్షాలపై బురదజల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. మహాలక్ష్మీ పథకం కింద మహిళలకు ఇస్తామన్న రూ.2,500 ఏమైనయ్? తులం బంగారం హామీ ఏ తీరానికి చేరింది? పెన్షన్లు రూ.4వేలు, విద్యార్థినులకు సూటర్ల హామీలు ఎప్పుడు నెరవేరుస్తారు? అని ఆమె ప్రశ్నించారు. హామీల అమలు, ని రుద్యోగుల ఆందోళనల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే నల్లగొండ సభలో రే వంత్‌రెడ్డి బూతులు మాట్లాడారని, ఆయన మాట్లాడే తీరు సీఎం పదవికే అవమానకరమని దుయ్యబట్టారు.
మూసీ ముసుగులో వేల కోట్ల దోపిడీ
మూసీ నది ప్రక్షాళనను బీఆర్ఎస్ ఎన్నడూ అడ్డుకోలేదని సబితాఇంద్రారెడ్డి స్పష్టంచేశారు. కానీ, ప్రక్షాళన ముసుగులో పేదల ఇండ్ల కూల్చివేయడాన్ని, వేల కోట్ల అవినీతి అక్రమాలు, దోపిడీని మాత్రమే తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టును కూళేశ్వ రం అని అవహేళన చేసిన రేవంత్‌రెడ్డి మరి ఇప్పుడు మూసీ ప్రక్షాళన కోసం అదే కాళేశ్వరంలో భాగమైన మల్లన్నసాగర్ నుంచి నీటిని మళ్లించబోమని గుండె మీద చేయి వేసుకొని చెప్పగలరా అని సవాల్ విసిరారు. బీఆర్ఎస్ పదేండ్ల ప్రగతిశీల పాలనపై, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై అసెంబ్లీలో చర్చించేందుకు తాము ఎప్పుడూ సిద్ధమేనని తేల్చిచెప్పారు. ఇప్పటికైనా రే వంత్‌రెడ్డి తన చౌకబారు డ్రామాలాపి, హా మీలపై దృష్టిపెట్టాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

