హైదరాబాద్, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ) : ఏపీ మాజీ సీఎం జగన్ ఈ నెల 28న కాలినడకన తిరుమలకు వెళ్లనున్నారు. తిరుమల లడ్డూ పవిత్రతను, స్వామివారి ప్రసాదం విశిష్టతను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేసిన ఏపీ సీఎం చంద్రబాబు పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు 28న అన్ని దేవాలయాల్లో పూజలు నిర్వహించాలని వైసీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. వేంకటేశ్వరస్వామి వైభవాన్ని, టీటీడీ పేరు ప్రఖ్యాతులను, లడ్డూ పవిత్రతపై రాజకీయ దుర్బుద్ధితో కావాలని అబద్ధాలాడుతున్నారని దుయ్యబట్టారు.