తిమ్మాజిపేట, నవంబర్ 28 : నాగర్కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలం గొరిట ప్రాథమిక పాఠశాలలో గురువారం మధ్యాహ్న భోజనం తిని విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.
మధ్యాహ్నం 12:15 గంటలకు టమాట రైస్, గుడ్డు వడ్డించారు. కాగా మధ్యాహ్నం 3:30 గంటలకు నలుగురు విద్యార్థులు వాంతులు చేసుకోగా.. వెంటనే ఉపాధ్యాయులు వైద్యులను పిలిపించి పాఠశాలలోనే చికిత్స చేయించారు.