వికారాబాద్/ఖైరతాబాద్, డిసెంబర్ 13 : వికారాబాద్ జిల్లా తాండూరు గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఈ నెల 10న కిచిడీ తిని 15 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. కాగా, వారిని హాస్టల్లోనే ఉంచి చికిత్స అందిస్తున్నారు.
తీవ్ర కడుపునొప్పి, వాంతులతో బాధపడుతున్న ఎనిమిదో తరగతి విద్యార్థిని లీలావతి ఆరోగ్య పరిస్థితి జఠిలంగా మారడంతో శుక్రవారం గుట్టుచప్పడు కాకుండా బాలికను హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించినట్టు తెలిసింది. ఘటనకు జిల్లా ఉన్నతాధికారుల నిర్లక్ష్యమే కారణమని విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు.