Munugode | తొమ్మిదేండ్ల బీఆర్ఎస్ పాలనలో మును‘గోడు’ తీరింది. దశ మారింది. ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీటిని అందిస్తున్న మిషన్ భగీరథ పథకం ఇక్కడి నుంచే మొదలైంది. డిండి ఎత్తిపోతలతో ఫ్లోరైడ్‌కు పరిష్కారం లభించింది. తాగు, సాగునీటి గోస తీరింది. రూ.4,545 కోట్లతో నియోజకవర్గవ్యాప్తంగా అభివృద్ధి జరిగింది.
నల్లగొండ ప్రతినిధి, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ): తొమ్మిదేండ్ల బీఆర్ఎస్ పాలనలో మునుగోడు దశ మారింది. మిషన్ భగీరథతో దశాబ్దాల ఫ్లోరైడ్ పీడ విరగడైంది. మునుపెన్న డూ లేని విధంగా రూ.4,545 కోట్లతో నియోజకవర్గవ్యాప్తంగా అభివృద్ధి జరిగింది. సమైక్య పాలకుల నిర్లక్ష్యంతో 2014 నాటికి ప్రపంచంలోనే మునుగోడు అత్యధిక ఫ్లోరైడ్ ప్రాంతంగా చరిత్రకెక్కింది. ఉద్యమ సమయంలోనే కేసీఆర్ పలుమార్లు మునుగోడులో పర్యటిస్తూ ఫ్లోరైడ్ బాధితులను చూసి చలించిపోయారు. ఫ్లోరైడ్ రక్కసిని రూపుమాపేందుకు ఇంటింటి కీ కృష్ణాజలాలు ఇచ్చేందుకు మిషన్ భగీరథ ప థకానికి సీఎం కేసీఆర్ ఇక్కడి నుంచే శ్రీకారం చుట్టారు. భగీరథ పైలాన్‌ను చౌటుప్పల్‌లో 2015 జూన్ 8న కేసీఆర్ ఆవిష్కరించారు. నియోజకవర్గంలో మెజార్టీ ప్రాంతాలకు తాగునీటి సరఫరా కోసం నాంపల్లి మండలం ఎస్డబ్ల్యూ లింగోటం వద్ద రోజుకు 70 మిలియన్ లీటర్ల నీటి శుద్ధి ప్లాంటును నిర్మించారు.
మునుగోడు నియోజకవర్గంలో రూ.151 కోట్లతో జీపీ భవనాలు, కమ్యూనిటీ హాళ్లు నిర్మించారు. 52 కోట్లతో 16 సబ్స్టేషన్లు, ట్రా న్స్ఫార్మర్ స్తంభాలు, ఇతర విద్యుత్తు పనులు చేపట్టారు. 52.79 కోట్లతో సర్వేల్ గురుకుల సహా ఇతర హాస్టళ్లలో మౌలిక వసతులు కల్పించారు. 1.49 కోట్లతో గోదాములు, మరమ్మతులు చేపట్టారు. చౌటుప్పల్ మున్సిపాలిటీలో సీసీరోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలకు 45 కో ట్లు కేటాయించారు. మునుగోడు ఉప ఎన్నికల్లో గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి ఏడాదిలోపే 600 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టారు. గతంలో ఉన్న పెండింగ్ పనులు సై తం పూర్తి చేశారు. చౌటుప్పల్ మండలం దం డుమల్కాపురంలో 460 ఎకరాల్లో ఏర్పాటుచేసిన గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నది. ఇప్పటికే 20 పరిశ్రమలు ఉత్పత్తులు ప్రారంభించాయి. మరో 150 పరిశ్రమలు నిర్మాణంలో ఉన్నాయి. ఈ పార్కు వినియోగంలోకి వస్తే 400 పరిశ్రమలు పనిచేస్తాయి. దీంతో 40 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుంది. 231 ఎకరాల్లో యాదాద్రి ఫుడ్ పార్కు, మరో 100 ఎకరాల్లో బొమ్మల తయారీ పరిశ్రమను ఏర్పాటు చేస్తున్నారు. చండూరు రెవెన్యూ డివిజన్, గట్టుప్పల్ మండలం దశాబ్దాల కలను సీఎం కేసీఆర్ నెరవేర్చారు.
6,500 కోట్లతో డిండి ఎత్తిపోతల ప్రాజెక్టు
1,480 కోట్లతో శివన్నగూడెం రిజర్వాయర్
495 కోట్లతో లక్ష్మణాపురం రిజర్వాయర్
102.9 కోట్లతో పిల్లాయిపల్లి కాల్వ మరమ్మతు
113 కోట్లతో చెరువుల మరమ్మతులు
3.68 కోట్లతో ప్రత్యేక చేనేత క్లస్టర్ల ఏర్పాటు
216.897 కోట్లతో ఆర్అండ్ బీ రోడ్ల నిర్మాణం