హైదరాబాద్, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ): కర్ణాటక, మహారాష్ట్రతోపాటు రాష్ట్రంలో విస్తృతంగా కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకున్నాయి. కృష్ణా, గోదావరి, తుంగభద్ర, మంజీరా తదితర నదులకు వరద పోటెత్తుతున్నది. వాగులన్నీ పొంగిపొర్లుతున్నాయి. ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్ర డ్యామ్లు పూర్తిస్తాయి నీటి నిల్వ సామర్థ్యానికి చేరువకాగా.. ఆయా ప్రాజెక్టుల నుంచి వరద జలాలను దిగువకు విడుదల చేస్తున్నారు. దీం తో జూరాల, శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టులకు భారీగా వరద కొనసాగుతుండగా గేట్లను తెరచి దిగువకు నీటిని వదులుతున్నారు. అదే విధ ంగా గోదావరి పరిధిలో ఎస్సారెస్పీ, ఎల్లంపల్లికి వరద పోటెత్తుతున్నది. ఇప్పటికే ఆయా ప్రాజెక్టులు పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యానికి చేరుకోగా, గేట్లను తెరచి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. మొత్తంగా మేజర్, మీడి యం ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకున్నా యి. చెరువులు సైతం నిండి మత్తళ్లు దుంకుతున్నాయి.