Jurala | జోగులాంబ గద్వాల : రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తోన్నాయి. కుండపోత వర్షాలకు ప్రాజెక్టులకు వరద ఉధృతి పెరిగింది. గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టు వరద ప్రవాహం క్రమక్రమంగా పెరుగుతోంది. జూరాల ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 70 వేలు, ఔట్‌ఫ్లో 37,267 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా ప్రస్తుత నీటిమట్టం 317.420 మీటర్ల వరకు నీరు చేరాయి. నీటి నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 7.498 టీఎంసీలుగా ఉంది.
జూరాలకు వరద ప్రవాహం పెరగడంతో.. ఆ ప్రాజెక్టు నిండుకుండలా మారింది. దీంతో ప్రాజెక్టును చూసేందుకు జనాలు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. జూరాల నుంచి దిగువకు కృష్ణమ్మ పరుగులు పెడుతున్న దృశ్యాలను పర్యాటకులు తమ కెమెరాల్లో బంధిస్తున్నారు. జూరాల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు కృష్ణమ్మ ఉరకలేస్తోంది. వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కృష్ణా పరివాహ ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
Corn | మొక్కజొన్నకు హైదరాబాదీలు ఫిదా.. పక్క రాష్ర్టాల నుంచి దిగుమతి
Cloud Services | క్లౌడ్ సర్వీసుల భద్రత ప్రశ్నార్థకమేనా?
Runa Mafi | మాఫీకి మరో మెలిక.. రుణమాఫీ కాకుంటే ఫిర్యాదు చేయాలట.. నెలరోజుల్లో చెప్తామంటున్న సర్కార్