Corn | మొక్కజొన్నకు హైదరాబాదీలు ఫిదా.. పక్క రాష్ర్టాల నుంచి దిగుమతి
నగరంలో మొక్కజొన్న కంకుల హవా వీస్తోంది. చల్లని వాతావరణంలో వేడివేడి నిప్పులపై కాల్చిన మొక్కజొన్నను ఆరగించడానికి నగరవాసులు అమితాసక్తి కనబరుస్తున్నారు. దీంతో కంకులకు మంచి డిమాండ్ ఏర్పడింది.
- నగరంలోకి తెలుగు రాష్ర్టాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కంకులు
- పెరిగిన విక్రయాలు
- వానకాలంలో కంకులకు డిమాండ్
Corn | సిటీబ్యూరో/అబిడ్స్, జులై 19 (నమస్తే తెలంగాణ): నగరంలో మొక్కజొన్న కంకుల హవా వీస్తోంది. చల్లని వాతావరణంలో వేడివేడి నిప్పులపై కాల్చిన మొక్కజొన్నను ఆరగించడానికి నగరవాసులు అమితాసక్తి కనబరుస్తున్నారు. దీంతో కంకులకు మంచి డిమాండ్ ఏర్పడింది. హైదరాబాద్ నగరానికి తెలుగు రాష్ర్టాలతో పాటు మహారాష్ట్ర , కర్ణాటక నుంచి కంకులు దిగుమతి అవుతున్నాయి. ప్రతి ఏడాది జూన్‌లోనే కంకులు దిగుమతి ఉండేది. ఈ సారి పంట ఆలస్యంగా రావడంతో జూలై నుంచి కంకుల సందడి నగరంలో కనిపిస్తుందని వ్యాపారులు చెబుతున్నారు.
ముఖ్యంగా ఓల్డ్ సిటీలోని దారూసలాం మార్గంలో కంకులు కుప్పలు తెప్పలుగా కనుల విందును పంచుతున్నాయి. చిరు వ్యాపారులు అక్కడ హోల్‌సేల్‌లో కొనుగోలు చేసి వాటిని వివిధ ప్రాంతాల్లో విక్రయిస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ ఒక్కో కంకి ధర రూ.5 ఉంది. కాగా, మార్కెట్లో ఈ కంకులు ఒక్కోటి రూ.20. దూర ప్రాంతాల నుంచి నగరానికి తీసుకురావడానికి రవాణా ఛార్జీల భారం పడుతుండటంతో ధరలు పెంచాల్సి వస్తుందని వ్యాపారి చాంద్ పాషా తెలిపారు. ఇప్పటి వరకు కేవలం 20 శాతం మాత్రమే మొక్కజొన్న కంకలు వచ్చాయని ఇంకా 80 శాతం రావాల్సి ఉందని జమీల్ తెలిపారు. సాధారణంగా హోల్‌సేల్ మార్కెట్ తెల్లవారు జామున 5 గంటల నుంచి ఉదయం 9 వరకు ఉంటుందని చెప్పారు.
ఈ మొక్కజొన్న సీజన్ ఆగస్టు చివరి వరకు ఉంటుందని, కాగా ఈ వర్షాకాలంలో మొక్కజొన్న కంకులు అధికంగా విక్రయమవుతాయని వ్యాపారులు తెలిపారు. రైతులకు, వినియోగదారులకు నష్టం లేకుండా ధరలు నిర్ణయిస్తామని హోల్‌సేల్ నిర్వాహకులు చెప్పారు. ఈ క్రమంలో సికింద్రాబాద్, అబిడ్స్, దిల్షుక్నగర్, ఉప్పల్, కూకట్పల్లి, బేగంపేట్ రద్దీ ప్రాంతాల్లోని మార్కెట్లో మొక్కజొన్న కంకుల సందడి అధికంగా ఉంది. కొంతమంది ఉడికించుకుని ఆరగిస్తుంటే.. ఇంకొందరూ కాల్చుకొని, మరికొందరు గారెలు ఇలా ఏదో ఒక రుచికరమైన ఆహార పదార్థాన్ని తయారు చేసుకుంటూ ఆరగిస్తుండటం విశేషం.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

