నగరంలో మొక్కజొన్న కంకుల హవా వీస్తోంది. చల్లని వాతావరణంలో వేడివేడి నిప్పులపై కాల్చిన మొక్కజొన్నను ఆరగించడానికి నగరవాసులు అమితాసక్తి కనబరుస్తున్నారు. దీంతో కంకులకు మంచి డిమాండ్ ఏర్పడింది.
పూర్వం రోజుల్లో రైతు లు ఒక వైపు ఒక రకం పంట మరో వైపు వేరొక పం టను వేస్తూ పంట మార్పిడి విధానాన్ని అవలంబించేవారు. వానకాలం, యాసంగిలోనూ ఒకే రకం (వరి) పం టసాగు చేయడంతో ఇతర పంటల సాగు క్రమేపి తగ్గుతూ వచ్చింది.