Nagarjuna Sagar | నల్లగొండ : భారీ వర్షాల కారణంగా కృష్ణా నదికి వరద పోటెత్తింది. దీంతో కృష్ణా బేసిన్లో ఉన్న ప్రాజెక్టులన్నింటికీ జలకళ వచ్చింది. జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. నాగార్జున సాగర్‌కు వరద పోటెత్తడంతో.. ఇవాళ ఉదయం రెండు క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. గేట్లను ఎత్తడంతో.. ఆ ప్రాంతంలో పర్యాటకులు ఎంజాయ్ చేస్తున్నారు.
సాగర్ జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 590 అడుగులుగా ఉంది. ప్రాజెక్టు నీటినిల్వ సామర్థ్యం 312.04 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటినిల్వ 312.04 టీఎంసీలు. జలాశయం ఇన్‌ఫ్లో 65.827 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 60.644 క్యూసెక్కులుగా ఉంది.