నల్లగొండ : జిల్లాలోని నాగార్జున సాగర్ జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కృష్ణమ ఉరకలేస్తూ.. సాగర్ను చేరుకుంటోంది. సాగర్ జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 568.10 అడుగులు. ప్రాజెక్టు పూర్తి నీటినిల్వ 312.04 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటినిల్వ 251.55 టీఎంసీలు. నాగార్జున సాగర్ జలాశయం ఇన్ ఫ్లో 1,36,816 క్యూసెక్కలు కాగా, ఔట్ ఫ్లో 12,676 క్యూసెక్కులుగా ఉంది.