Ravi Teja | మాస్ మహారాజ రవితేజ వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఇటీవల ఆయన నటించిన ‘ఇరుముడి’ సినిమాతో భారీ విజయాన్ని అందుకోవడంతో మరోసారి ఫుల్ ఫామ్‌లోకి వచ్చారు. ఈ విజయంతో రవితేజ తదుపరి సినిమాలపై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. ముఖ్యంగా ఆయన లైనప్‌లో ఉన్న యువ దర్శకుల సినిమాలపై ఇప్పుడు ఇండస్ట్రీలోనూ చర్చ జరుగుతోంది.రవితేజ చేయబోయే సినిమాల జాబితాలో దర్శకుడు వివేక్ ఆత్రేయ ప్రాజెక్ట్ కూడా ఉన్న విషయం తెలిసిందే. విభిన్నమైన కథలను తనదైన శైలిలో తెరకెక్కించే దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న వివేక్ ఆత్రేయ.. ఈసారి రవితేజతో ఓ ఆసక్తికరమైన కథను సిద్ధం చేసినట్టు తెలుస్తోంది.
రవితేజ–వివేక్ ఆత్రేయ కాంబినేషన్లో తెరకెక్కనున్న ఈ సినిమా హారర్ కామెడీ థ్రిల్లర్‌గా ఉండనున్నట్టు సమాచారం. రవితేజ మాస్ ఇమేజ్‌కు, వివేక్ ఆత్రేయ టేకింగ్‌కు భిన్నమైన కథనం తోడైతే సినిమా ఆసక్తికరంగా ఉండొచ్చనే అంచనాలు ఇప్పటికే మొదలయ్యాయి.ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికరమైన విషయం ఇప్పుడు సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ హారర్ ఎంటర్టైనర్కు ‘తులా భారం’ అనే టైటిల్‌ను మేకర్స్ పరిశీలించి, ఖరారు చేసినట్టు తెలుస్తోంది. అయితే ఈ టైటిల్‌పై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇప్పటికే దర్శకుడు వివేక్ ఆత్రేయ ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్‌ను పూర్తి చేసినట్టు సమాచారం. కథ, కథనంపై పూర్తి క్లారిటీతో ఉన్న దర్శకుడు.. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌ను సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.
అన్నీ అనుకున్నట్టుగా జరిగితే దసరా సమయానికి ఈ సినిమా షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉందని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అయితే షూటింగ్ ప్రారంభ తేదీ, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు, నిర్మాణ సంస్థ వంటి వివరాలపై ఇంకా అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది. రవితేజ ఇప్పటివరకు మాస్, యాక్షన్, కామెడీతో పాటు విభిన్నమైన కథల్లోనూ నటించారు. ఇప్పుడు వివేక్ ఆత్రేయతో చేయబోయే సినిమా హారర్ కామెడీ థ్రిల్లర్ కావడం ఆసక్తిని పెంచుతోంది. ఈ జానర్లో రవితేజ కామెడీ టైమింగ్, మాస్ ఎనర్జీని దర్శకుడు వివేక్ ఆత్రేయ ఎలా ఉపయోగించుకోబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది.ప్రస్తుతం ‘తులా భారం’ అనే టైటిల్‌కు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారుతోంది.