Illegal assets | ఆదాయానికి మించి అక్రమ ఆస్తులు.. టీపీవోపై కేసు నమోదు
Illegal assets | లంచం తీసుకుంటూ పట్టుబడ్డ రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ అధికారిణి గుండు వాణి పై అక్రమ ఆస్తుల కేసు నమోదయ్యింది.
రంగారెడ్డి : లంచం తీసుకుంటూ పట్టుబడ్డ రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ అధికారిణి గుండు వాణి ( Gundu Vani ) పై అక్రమ ఆస్తుల ( Illegal assets ) కేసు నమోదయ్యింది. ఏసీబీ అధికారులు సోమవారం టీపీవో ( TPO) ఇంటితో పాటు కార్యాలయం, ఆమెకు సంబంధించిన ఎనిమిది మంది బంధువులు, బినామిదారుల ఇండ్లపై దాడులు జరిపి విలువైన డాక్యుమెంట్లను స్వాధీన పరుచుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల, జనగాం జిల్లా పాలకుర్తిలో రెండు ఓపెన్ ప్లాట్లు,రంగారెడ్డి జిల్లా అత్తాపూర్లో ఒక రెసిడెన్షియల్ ఫ్లాట్, జీ ప్లస్ టూ బిల్డింగ్, కోయిల్కొండ మండలంలో ఎకరంన్నర వ్యవసాయ భూమి ఉన్న ట్లు గుర్తించామని వివరించారు. రూ.5.47 లక్షల నగదు, రూ.8 లక్షలు బ్యాంక్ బ్యాలెన్స్, 175 గ్రాముల బంగారు ఆభరణాలు, వాహనాలు ఉన్నాయని తెలిపారు. వీటి మొత్తం విలువ రూ. 6.76 కోట్ల వరకు ఉంటుందని వివరించారు.
ఉద్యోగ సమయంలో అక్రమంగా సంపాదించినట్లు గుర్తించి ఆమెపై కేసు నమోదు చేసి హైదరాబాద్ కోర్టులో ప్రవేశపెట్టామని, వెల్లడించారు. టీపీవో సెప్టెంబర్ 30న పంచాయతీ కార్యదర్శి నుంచి రూ.75 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Illegal assets | ఆదాయానికి మించి అక్రమ ఆస్తులు.. టీపీవోపై కేసు నమోదు
Harish Rao | పదేండ్లు తట్టెడు మట్టి ఎత్తకుండా కాంగ్రెస్ సర్కార్ కాలయాపన : హరీశ్ రావు
Health Tips | కోడిగుడ్డు పచ్చసొన తింటే ఒంట్లో చెడు కొవ్వు పెరుగుతుందా.. ?
Foods In Fridge | ఆహారాలను ఫ్రిజ్లో ఉంచి పదే పదే వేడి చేసి తింటున్నారా.. ఎలాంటి వ్యాధులు వస్తాయంటే..?
డైవర్షన్ రోడ్డును పునఃరుద్దరించాలని కంపగూడెం గ్రామస్తుల ధర్నా
ట్రెండింగ్ వార్తలు
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి

