Musi River | నల్లగొండ : కేతేపల్లి మండల పరిధిలోని మూసీ ప్రాజెక్టు నిండు కుండలా మారింది. రెండు నెలల ముందే ప్రాజెక్టు పూర్తిగా నిండిపోయింది. దీంతో మూడవ నెంబర్ కస్ట్ర్ గేటు ఆరు అడుగుల మేర ఎత్తి 330 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు.
గత కొద్ది రోజుల నుంచి హైదరాబాద్‌తో పాటు ఎగువన కురుస్తున్న వర్షాల నేపథ్యంలో మూసీ నదికి వరద పోటెత్తింది. దీంతో జూన్ మొదటి వారంలోనే ప్రాజెక్టు నీటితో కళకళలాడుతోంది. నీటిమట్టం గరిష్ఠ స్థాయికి చేరుకుంది. మూసీ పూర్తిస్థాయి నీటిమట్టం 645 అడుగులు కాగా, ప్రస్తుతం నీటిమట్టం 644.60 అడుగులుగా ఉంది.
ఇన్ ఫ్లో : 243.16 క్యూసెక్కులు
అవుట్ ఫ్లో : 88.17 క్యూసెక్కులు
పూర్తి స్థాయి నీటిమట్టం : 645 అడుగులు
ప్రస్తుత నీటిమట్టం : 644.60 అడుగులు
పూర్తి స్థాయి సామర్థ్యం : 4.46 టీఎంసీలు.
ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం : 4.36 టీఎంసీలు