జోగులాంబ గద్వాల : ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో జూరాల ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. గంట గంటకూ జూరాల వద్ద వరద ఉధృతి పెరుగుతుంది. కృష్ణమ్మ పరవళ్లను చూసేందుకు పర్యాటకులు భారీగా తరలివస్తున్నారు. జూరాల ప్రస్తుత నీటిమట్టం 317.94 మీటర్లు కాగా, పూర్తి స్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు. ప్రస్తుత నీటినిల్వ 8.493 టీఎంసీలు కాగా, పూర్తిస్థాయి నీటినిల్వ 9.657 టీఎంసీలు. ప్రాజెక్టు ఇన్ ఫ్లో 2.10 లక్షల క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 2.17 లక్షల క్యూసెక్కులుగా ఉంది.