హైదరాబాద్ : భారీ వర్షాల(Heavy rains) నేపథ్యంలో సహాయక చర్యలలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని వరద బాధితులు ఆందోళన చేట్టారు. ఖమ్మం జిల్లాలో గత రెండు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకుజనజీవనం స్తంభించిపోయింది. ఎడతెరిపిలేపి లేకుండా కురుస్తున్రన వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లు తున్నాయి. చెరువులు, కుంటలు అలుగు దుంకుతున్నాయి. పలు చోట్ల చెట్లు విరిగిపడి, కరెంట్ స్తంభాలు నేలకూడలంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇండ్లు కోల్పోయి ఎంతో మంది నిరాశ్రయులయ్యారు.
అయితే ప్రభుత్వం బాధితులను ఆదుకోవడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపిస్తూ ఖమ్మం(Khammam) కాలువ ఒడ్డు వద్ద త్రీ టౌన్ ప్రాంత ప్రజలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాగా, భారీ వర్షాల నేపపథ్యంలో అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకి రావొద్దని అధికారులు హెచ్చరించారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏ అవసరం వచ్చినా అధికారులకు ఫోన్లో సమాచారం ఇవ్వాలన్నారు.
భారీ వర్షాల నేపథ్యంలో సహాయక చర్యలలో ప్రభుత్వం విఫలమైంది అంటూ ఖమ్మం కాలువ ఒడ్డులో నిరసన
రోడ్ పై బైఠాయించి నిరసన తెలుపుతున్న త్రీ టౌన్ ప్రాంత ప్రజలు
ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ సీఎం, ఖమ్మం జిల్లా ముగ్గురు మంత్రులకు వ్యతిరేకంగా మున్నేరు వరద బాధితులు నిరసన pic.twitter.com/VKCpEV2rJT
— Telugu Scribe (@TeluguScribe) September 1, 2024