ఖమ్మం : ఖమ్మంలో(Khammam) వర్షాలు తగ్గినా ప్రజల కష్టాలు మాత్రం తీరడం లేదు. భారీ వర్షాలకు సర్వం కోల్పోయి వీధిన పడ్డ ప్రజలు ప్రభుత్వ సాయం కోసం కండ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. వరద బాధితులను (Flood victims)అన్ని విధాలా ఆదుకుంటామని ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా చెప్పింది. కానీ, క్షేత్ర స్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి.
ఖమ్మం మున్సిపల్ ఆఫీసు దగ్గర వరద సాయం అందలేదని ఫిర్యాదు చేయడానికి పెద్ద ఎత్తున బాధితులు తరలి వచ్చారు. వరదల్లో తాము పూర్తిగా నష్టపోయామని.. అయినా తమకు వరద సహాయం అందలేదంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని వరద బాధితులు కోరుతున్నారు.
ఖమ్మం మున్సిపల్ ఆఫీసు దగ్గర వరద సాయం అందలేదని ఫిర్యాదు చేయడానికి పెద్ద ఎత్తున వచ్చిన బాధితులు
వరదల్లో తాము పూర్తిగా నష్టపోయామని.. అయినా తమకు వరద సహాయం అందలేదంటూ కన్నీళ్లు పెట్టుకున్న వరద బాధితులు. pic.twitter.com/TYFSYioJaq
— Telugu Scribe (@TeluguScribe) September 18, 2024