Nagarjuna Sagar | నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్ జలాశయానికి ఎగువ నుంచి భారీ వరద ప్రవాహం కొనసాగుతున్నది. ప్రస్తుతం జలాశయానికి 2.82లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా.. అవుట్ ఫ్లో 7,012 క్యూసెక్కులుగా ఉన్నది. జలాశయం పూర్తి నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 532.5 అడుగులకు చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.5 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 172.87 టీఎంసీలుగా ఉన్నది. ప్రస్తుతం కృష్ణా బేసిన్‌లోని శ్రీశైలం, జూరాల, ఆలమట్టి డ్యామ్‌కు వరద ప్రవాహం కొనసాగుతున్నది. ఈ క్రమంలో ప్రాజెక్టుకు వచ్చిన వరదను దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం వరద ఇలాగే కొనసాగితే జలాశయం నిండుకుండలా మారనున్నది.