నమస్తే నెట్వర్క్, ఏప్రిల్ 24: రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. వడదెబ్బకు గురువారం ఒక్కరోజే ఐదుగురు మృత్యువాతపడ్డారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం మార్లవాయికి చెందిన కనక కాశీరాం(42), పెంచికల్పేట్ మండలం ఎలపల్లికి చెందిన లోంకర్ ప్రభాకర్ (24), మంచిర్యాల జిల్లా జన్నారం మండలం తొమ్మిదిగుడిసెల పల్లెకు చెందిన రాసమల్ల భూదేవి(60) వడదెబ్బతో మృతిచెందారు.
నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన సోఫీబేగ్ (25) గురువారం వడదెబ్బతో మృతి చెందారు. జయశంకర్భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండల కేంద్రానికి చెందిన చింతకుంట్ల రమేశ్ (30) ఎండ వేడిమికి అస్వస్థతకు గురై మరణించారు.