Weather Upate | హైదరాబాద్, మే11 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురుస్తుండగా ఐదురోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మూ డు రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీలు తక్కువగా నమోద య్యే అవకాశముందని వెల్లడించింది.
ఈ నెల 13,14న ఆదిలాబాద్, నిర్మ ల్, నిజామాబాద్, సిద్దిపేట, యాదాద్రి-భువనగిరి, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ-గద్వాల.. జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, గంటకు 50 నుంచి 60 కి.మీ వేగంతోఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఆయా జిల్లాలకు ఆరెంజ్ జారీచేసింది. రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 38.2డిగ్రీలు, కనిష్టంగా 23.1డిగ్రీలు నమోదవుతాయని తెలిపింది.