కడ్తాల్: రంగారెడ్డి జిల్లాలోని కడ్తాల్ నుంచి హైదరాబాద్కు వెళ్తున్న కారులో ఇవాళ ఒక్కసారిగా మంటలు(Fire Accident) చెలరేగాయి. మక్తమాదారం గేటు వద్దకు రాగానే ఆ ప్రమాదం జరిగింది. సడెన్గా మంటలు వ్యాపించడంతో ఆ కారులో ప్రయాణిస్తున్న నలుగురు సురక్షితంగా బయటపడ్డారు. ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. మంటల్లో కారు పూర్తిగా దగ్ధమైంది. తలకొండపల్లి మండలంలోని వెంటాపూర్ నుంచి హైదరాబాద్కు వస్తున్న సమయంలో కారు అగ్నిప్రమాదానికి గురైంది. అయితే దాంట్లో ఉన్న ప్రయాణికులు అప్రమత్తం కావడంతో.. పెను ప్రమాదం తప్పింది. షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఆ కారులో యువకులు ప్రయాణిస్తున్నట్లు గుర్తించారు. ఈ ప్రమాదం పట్ల ఎవరూ ఫిర్యాదు చేయలేదని స్థానిక పోలీసులు వెల్లడించారు.