ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం దిగిరావడంతో దళితబంధు నిధులకు మోక్షం కలిగింది. లబ్ధిదారుల ఖాతాల ఫ్రీజింగ్‌ను సర్కార్ ఎత్తివేసింది. లబ్ధిదారులు, వారి తరఫున బీఆర్ఎస్ పోరాటానికి ఫలితం దక్కింది. రెండోవిడత దళితబంధు నిధులపై విధించిన ఫ్రీజింగ్‌ను ఎత్తివేయడంతో దళిత కుటుంబాల్లో ఆనందం వెల్లివిరిసింది. నాడు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా ఎంపికైన 10,408 మంది దళిత కుటుంబాలకు లబ్ధి చేకూరనున్నుది. ఈ మేరకు రూ.334.63 కోట్ల నిధులను లబ్ధిదారులకు విడుదల చేయాలని ఎస్సీ కార్పొరేషన్ ఎండీ నుంచి ఆదేశాలు వెళ్లాయి.
ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం దిగిరావడంతో దళితబంధు నిధులకు మోక్షం కలిగింది. లబ్ధిదారుల ఖాతాల ఫ్రీజింగ్‌ను సర్కార్ ఎత్తివేసింది. లబ్ధిదారులు, వారి తరఫున బీఆర్ఎస్ పోరాటానికి ఫలితం దక్కింది. రెండోవిడత దళితబంధు నిధులపై విధించిన ఫ్రీజింగ్‌ను ఎత్తివేయడంతో దళిత కుటుంబాల్లో ఆనందం వెల్లివిరిసింది. నాడు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా ఎంపికైన 10,408 మంది దళిత కుటుంబాలకు లబ్ధి చేకూరనున్నుది. ఈ మేరకు రూ.334.63 కోట్ల నిధులను లబ్ధిదారులకు విడుదల చేయాలని ఎస్సీ కార్పొరేషన్ ఎండీ నుంచి ఆదేశాలు వెళ్లాయి.
Dalitha Bandhu | హైదరాబాద్, జనవరి 29 (నమస్తే తెలంగాణ)/కరీంనగర్/హుజూరాబాద్ టౌన్: దళితుల బతుకుల్లో వెలుగులు చూడాలన్న తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్షలకు అనుగుణంగా దళిత బంధు పథకం రూపుదిద్దుకున్నది. దళితుల అభ్యున్నతికి, ఆర్థిక ప్రగతిని సాధించేందుకు కేసీఆర్ నేతృత్వంలోని గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ పథకానికి శ్రీకారం చుట్టింది. ఆ మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకాన్ని తీసుకురావాలని సంకల్పించింది. 2021లో వాసాలమర్రి గ్రామంలో ప్రారంభమైన ఈ పథకం ఆ తర్వాత కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గాన్ని తొలుత పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసింది. ఆ నియోజకవర్గంలో 18,021 మంది లబ్ధిదారులను గుర్తించి ఒక్కొక్కరికీ రూ.10 లక్షల చొప్పున నిధులను మంజూరు చేశారు. ఇందులో రూ.10 వేలు దళిత సంక్షేమ నిధికి జమ చేయగా, మిగతా రూ.9.90 లక్షలను లబ్ధిదారులైన దళితుల ఖాతాల్లో జమచేశారు. వీటితో దళితులు తమ ఇష్టమైన వ్యాపారం చేసుకోవడం, అద్దె, ఇతర వాహనాలు కొనుగోలు చేసుకొని తమ జీవన ప్రమాణాలను మెరుగుపర్చుకున్నారు. ఎంపికైన లబ్ధిదారుల్లో 9,873 మందికి ఆర్థికసాయం అందించారు. మిగతా లబ్ధిదారులు ఎంచుకున్న యూనిట్లను బట్టి 50 నుంచి 80 ఆపై శాతం ఆర్థిక సాయాన్ని అందించారు. అంతలో అసెంబ్లీ ఎన్నికలు రావడంతో ఎన్నికల కమిషన్ ఈ పథకానికి బ్రేక్ వేసింది.
రెండో విడత రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన నియోజకవర్గాల్లో పైలట్ ప్రాజెక్టుగా దళితబంధు పథకాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసింది. మొదటి, రెండో విడత కలిపి మొత్తంగా 44 వేల మందికిపైగా ఈ పథకం ద్వారా లబ్ధిపొందారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం దాదాపు రూ.4,400 కోట్లను లబ్ధిదారుల ఖాతాలకు నిధులను విడుదల చేసింది. తొలుత యాదాద్రి జిల్లా వాసాలమర్రి గ్రామంలో మొదలుపెట్టి హుజూరాబాద్ నియోజకవర్గంలోని దళితులందరికీ, ఆపైన కామారెడ్డి జిల్లా నిజాంసాగర్, ఖమ్మం జిల్లా చింతకాని, నాగర్‌కర్నూల్ జిల్లా చారగొండ, సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలాల్లోని దళితులందరికీ పథకాన్ని వర్తింపజేసింది. ఆ తర్వాత హుజురాబాద్‌ను మినహాయించి మిగతా 118 నియోజకవర్గాల్లో 1,500 చొప్పున మొత్తంగా 17,700 కుటుంబాలకు దళితబంధు పథకాన్ని వర్తింపజేసి ఆర్థిక సాయాన్ని అందజేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలో అసెంబ్లీ ఎన్నికల కోడ్ రావడంతో పథకాన్ని నిలిపివేసింది. కాంగ్రెస్ పాలనలో దళితబంధు నిధులను ఇవ్వకుండా కాలయాపన చేస్తూ వచ్చింది. దీంతో లబ్ధిదారులు ఆందోళనకు దిగారు. ఏడాదిగా బీఆర్ఎస్, లబ్ధిదారులు పోరాటాలు చేస్తూ వచ్చారు. దీంతో దిగొచ్చిన సర్కారు ఎట్టకేలకు నిధులను విడుదల చేస్తూ ఆదేశాలను జారీ చేసింది.
రాష్ట్రవ్యాప్తంగా 10,408 మంది దళితబంధు లబ్ధిదారులకు సంబంధించి రూ.334.63 కోట్ల పెండింగ్ నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లకు ఎస్సీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ క్షితిజ బుధవారం ఉత్తర్వులను జారీ చేశారు. దళితుల అభ్యున్నతికి, ఆర్థిక ప్రగతిని సాధించేందుకు కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం దళితబంధు పథకానికి శ్రీకారం చుట్టగా, దళితబంధు లబ్ధిదారులు, బీఆర్ఎస్ పార్టీ అవిశ్రాంత పోరాటంతో ఎట్టకేలకు ఈనాటి ప్రభుత్వం దిగివచ్చింది.
దళితబంధు పథకం కింద గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.10 లక్షల ఆర్థికసాయాన్ని నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోనే జమజేసింది. అందులో చాలామంది లబ్ధిదారులు ఒకటికి మించి యూనిట్లను ఏర్పాటు చేసుకోవాలని భావించారు. ఈ క్రమంలో తొలుత బ్యాంకులోని కొంత మొత్తం నిధులతో ఒక యూనిట్‌ను ఏర్పాటు చేసుకున్నారు. తదుపరి మిగిలిన నిధులతో మరొక యూనిట్‌ను ఏర్పాటు చేసుకోవాలని ప్రణాళికలను సిద్ధం చేసుకున్నారు. అయితే ఈ క్రమంలో అసెంబ్లీ ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. దళితబంధు లబ్ధిదారులకు సంబంధించి బ్యాంకుల్లో నిల్వ ఉన్న నిధులను విడుదల చేయకుండా ఆదేశాలను జారీ చేసింది. దీంతో మొదటి విడతలో ఎంపికైన 9,937 మందికి సంబంధించి రూ.324.75 కోట్లు, రెండవ విడతలో ఎంపికైన 471 మంది లబ్ధిదారులకు సంబంధించి 9.88 కోట్లు బ్యాంకుల్లోనే ఉండిపోయాయి. మొత్తంగా 10,408 మందికి రూ.334.63 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రస్తుతం బ్యాంకు ఖాతాల్లోనే ఉండిపోయిన ఆ నిధులను సదరు లబ్ధిదారులకు విడుదల చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు ఎస్సీ కార్పొరేషన్ ఎండీ క్షితిజ ఆదేశాలను జారీచేశారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి దళితబంధు నిధుల విడుదల చేయకుండా పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ వస్తున్నది. ఏడాదిగా కాలయాపన చేస్తున్నది. ఈ నేపథ్యంలోనే లబ్ధిదారులు దళితబంధు సాధన సమితి పేరిట రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడుతున్నారు. సమితికి బీఆర్ఎస్ నాయకులు బాసటగా నిలిచారు. ప్రభుత్వంపై ఏడాదిగా అవిశ్రాంతంగా పోరాడుతూ వస్తున్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఆందోళనకు దిగిన స్థానిక ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డిపైనా ప్రభుత్వం కేసులు నమోదు చేసింది. దళితబంధు నిధులను సత్వరమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వంపై అన్నివిధాలా ఒత్తిడి చేస్తూ వచ్చారు. దీంతో ఎట్టకేలకు దిగివచ్చిన ప్రభుత్వం తాజాగా బ్యాంకుల్లోని నిధులను లబ్ధిదారులకు విడుదల చేయాలని నిర్ణయించింది.
దళితబంధు లబ్ధిదారుల ఖాతాలపై ప్రభుత్వం విధించిన ఆంక్షలను ఏడాది తర్వాత తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో హుజూరాబాద్ నియోజకవర్గంలోని దళితులు సంబురాలు చేసుకున్నారు. అంబేద్కర్ విగ్రహాలకు క్షీరాభిషేకాలు చేశారు. ఇది తమ విజయమని దళితబంధు సాధన సమితి నాయకులు కొలుగూరి సురేశ్ వ్యాఖ్యానించారు. జమ్మికుంటలోనూ వేడుకలు జరుపుకున్నారు. ‘దళితబంధు’ ద్వారా దళిత కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపింది కేసీఆర్ అయితే, దళిత కుటుంబాల పక్షాన కొట్లాడి రెండో విడుత నిధులు విడులయ్యేలా కొట్లాడిన ఘనత హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డిదంటూ పలువురు దళితులు కొనియాడారు. బుధవారం దళిత సంఘం నాయకుడు మంద రాజేశ్ ఆధ్వర్యంలో జమ్మికుంటలోని తెలంగాణ చౌక్ వద్ద ‘దళిత బంధు’వులు ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు.
దళితబంధును పూర్తిగా అమలు చేయాల్సిందేనని హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దళితబంధు రెండోవిడత నిధుల విడుదలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై ఆయన ఓ వీడియో సందేశంలో హర్షం వ్యక్తంచేశారు. దళితుల ఆర్థికస్థితిని మెరుగుపర్చాలని, వారి జీవితాల్లో ఆర్థిక స్వావలంబన తీసుకురావాలని భావించిన కేసీఆర్ నాడు దళితబంధు పథకాన్ని అమలు చేశారని పేర్కొన్నారు. అంబేదర్ ఆశయాలను సాకారం చేయడమే లక్ష్యంగా, దేశంలో ఎకడా లేని విధంగా రూ.10 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రతి దళిత కుటుంబానికి అందించేందుకు ఈ పథకాన్ని ప్రవేశపెట్టారని గుర్తుచేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక దళితబంధు లబ్ధిదారుల ఖాతాలపై ఫ్రీజింగ్ విధించి రెండో విడత లబ్ధిదారులకు చెందాల్సిన నిధులకు అడ్డుకట్ట వేసిందని తెలిపారు.. ఈ క్రమంలో దళితుల తరఫున బీఆర్ఎస్ పార్టీ పోరాడిందని తెలిపారు.