హైదరాబాద్: పంచాయతీ ఎన్నికల (Panchayathi Elections) తుది విడత పోలింగ్ (Polling) కొనసాగుతున్నది. ఉద యం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరుగనుంది. తుది విడత పోరులో 31 జిల్లాల్లోని 3,752 సర్పంచ్ స్థానాలకుగాను 12,652 మంది అభ్యర్థులు పోటీచేస్తున్నారు. 28,410 వార్డులకుగాను 75,725 మంది బరిలో ఉన్నారు. మొత్తం 36,483 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటుచేశారు.
చివరి విడతలో మొత్తం 4,159 గ్రామపంచాయతీలకు ఎస్ఈసీ నోటిఫికేషన్ ఇచ్చింది. ఇందులో వివిధ కారణాలతో 11 జీపీలకు నామినేషన్లు దాఖలు కాలేదు. హైకోర్టు ఆదేశాలతో 2 గ్రామాల్లో ఎన్నికలు నిలిచిపోయాయి. మరో 394 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 3,752 గ్రామాల్లో పోలింగ్ నిర్వహిస్తున్నారు. మొత్తం 53,06,401 మంది ఓటర్లు ఉండగా, వీరిలో పురుషులు 26,01,861మంది, మహిళలు 27,04,394 మంది, 140 మంది ఇతరులు ఉన్నారు. తుది విడత మొత్తం 36,452 వార్డుల కోసం నోటిఫికేషన్ ఇచ్చారు. వీటిలో 116 వా ర్డులకు నామినేషన్లు పడలేదు. మరో 7,908 వా ర్డులు ఏకగ్రీవమవగా, 18 వార్డుల్లో ఎన్నికలు నిలిచిపోయాయి. మిగిలిన 28,410 వార్డులకుగాను 75,725 మంది పోటీలో ఉన్నారు. కాగా, ఈ ఎన్నికల్లో 43,856 బ్యాలెట్ బాక్సులను వినియోగిస్తున్నారు. 3,547 పోలింగ్స్టేషన్ల నుంచి వెబ్‌కాస్టింగ్ చేస్తున్నారు.
తుది విడత ఎన్నికల వివరాలు