Kukatpally : కూకట్పల్లిలోని హైదర్ నగర్లో కల్తీ కల్లు (Adulterated Toddy) తాగిన పలువురు ఆస్పత్రి పాలయ్యారు. స్థానికంగా ఉన్న కల్లు కాంపౌండ్స్లో మంగళవారం కల్లు తాగిన వాళ్లలో నలుగురు మహిళలు సహా 15 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. విరేచనాలు, లో బీపీతో ఇబ్బంది పడిన వీళ్లకు ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఒకరి పరిస్థతి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు.
సదరు హాస్పిటల్ సిబ్బంది కల్తీ కల్లు బాధితుల గురించి జీహెచ్ఎంసీ ఎంహెచ్వోకు సమాచారం అందించారు. విషయం తెలిసిన వెంటనే అక్కడకు చేరుకున్న బీఆర్ ఎస్ ఎమ్యెల్యే మాధవరం కృష్ణారావు బాధితులను పరామర్శించి, చికిత్స వివరాలను తెలుసుకున్నారు. బాలానగర్ డీసీపీ, కూకట్పల్లి ఏసీపీలు సైతం బాధితులను నుంచి వివరాలు సేకరించారు.