Wimbledon : తుది దశకు చేరిన వింబుల్డన్(Wimbledon)లో టాప్ సీడ్స్‌కు ఎదురన్నదే లేకుండా పోయింది. అంచనాలును అందుకుంటూ పురుషుల సింగిల్స్‌లో టేలర్ ఫ్రిట్జ్(Taylor Fritz), మహిళల సింగిల్స్‌లో అరీనా సబలెంకా(Aryna Sabalenka) అలవోకగా సెమీస్ బెర్తు సాధించారు. ఈ ఏడాది సూపర్ ఫామ్‌లో ఉన్న అమెరికా సంచలనం క్వార్టర్ ఫైనల్లో కరెన్ కచనోవ్ (రష్యా)ను ఓడించాడు. మ్యాచ్ మధ్యలో పాదం నొప్పి ఇబ్బంది పెట్టినా అతడు పట్టువిడువలేదు. ప్రత్యర్థిని 6-3, 6-4, 1-6, 7-6 (4)తో మట్టికరిపించి తొలిసారి ఈ గ్రాస్ కోర్ట్ గ్రాండ్‌స్లామ్ సెమీస్‌కు దూసుకెళ్లాడు.
నిరుడు యూఎస్ ఓపెనర్ రన్నరప్ అయిన ఫ్రిట్జ్ వింబు ల్డన్లోనూ టైటిల్‌కు మరింతగా సమీపించాడు. క్వార్టర్ ఫైనల్లో తొలి సెట్‌ను సునాయసంగా గెలుచుకున్న అమెరికా స్టార్.. రెండో సెట్లోనూ 17వ సీడ్ కెరెన్కు ఛాన్స్ ఇవ్వలేదు. అయితే.. మూడో సెట్లో పుంజుకున్న కరెన్ 6-1తో ఫ్రిట్జ్కు షాకిచ్చాడు. నిర్ణయాత్మక నాలుగో సెట్లో ఒక్క పాయింట్ తేడాతో పైచేయి సాధించిన అతడు సెమీస్ చేరుకున్నాడు. ఫైనల్ బెర్త్ కోసం డిఫెండింగ్ ఛాంపియన్ అల్కరాజ్ లేదా అన్‌సీడెడ్ కామ్ నొర్రీతో తలపడనున్నాడు.
Breaking new ground.
Taylor Fritz reaches his first #Wimbledon SF, defeating Karen Khachanov 6-3, 6-4, 1-6, 7-6(4) pic.twitter.com/QdVCQFtTGv
— Wimbledon (@Wimbledon) July 8, 2025
మహిళల విభాగంలో ఫేవరేట్ అయిన సబలెంకా తన మార్క్ ఆటతో లారా సీగెముంద్కు చెక్ పెట్టింది. పదునైన సర్వ్‌లు, బలమైన షాట్లతో విరుచుకుపడిన బెలారస్ భామ వరుసగా మూడోసారి సెమీఫైనల్లో అడుగుపెట్టింది. ఆద్యంతం హోరాహోరీగా సాగిన పోరులో సబలెంకా 4-6, 6-2, 6-4తో లారాను ఓడించింది.
Comeback complete 🙌
World No.1 Aryna Sabalenka defeats Laura Siegemund 4-6, 6-2, 6-4 to reach her third #Wimbledon semi-final. pic.twitter.com/VBfLu53Evz
— Wimbledon (@Wimbledon) July 8, 2025