Hari Hara Veera Mallu | టాలీవుడ్ యాక్టర్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కాంపౌండ్ నుంచి వస్తోన్న మోస్ట్ అవెయిటెడ్ ప్రాజెక్ట్ హరిహరవీరమల్లు (Hari Hara Veera Mallu). జ్యోతికృష్ణ దర్శకత్వం వహిస్తున్నా ఈ మూవీ రెండు పార్టులుగా తెరకెక్కుతుండగా.. హరిహరవీరమల్లు పార్ట్-1 జులై 24న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.
విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో మేకర్స్ ఏదో ఒక అప్డేట్ అందిస్తూ అభిమానులు, మూవీ లవర్స్‌లో జోష్ నింపుతున్నారు. ఇప్పటివరకు విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్ సినిమా థీమ్ ఎలా ఉండబోతుందో చెబుతూనే.. పవన్ కల్యాణ్ హరిహరవీరమల్లుగా బాక్సాఫీస్‌పై దండయాత్ర చేయడం పక్కా అని చెప్పకనే చెబుతున్నాయి.
అయితే తాజాగా మరో ఆసక్తికర వార్త నెట్టింట రౌండప్ చేస్తోంది. హరిహరవీరమల్లు పురాణాలతో మిళితమైన ఓ కల్పిత కథనం అట. లీడ్ రోల్ హరిహరవీరమల్లు పాత్ర సనాతన ధర్మాన్ని కాపాడే లార్డ్ విష్ణు, లార్డ్ శివను ప్రతిబింబించేలా ఉండబోతుందంటే ఇండస్ట్రీ సర్కిల్లో ఓ క్రేజీ న్యూస్ హాట్ టాపిక్‌గా మారింది. టైటిల్లో హరి (విష్ణు) హర (శివుడు) వచ్చే పేర్లు ఈ విషయంపై క్లారిటీ ఇచ్చేస్తున్నాయి.
హరిహరవీరమల్లు పోస్టర్లో ఓ వైపు విష్ణువు వాహనం గరుడ పక్షిని ప్రతిబింబించే డేగ కనిపిస్తుండగా.. మరోవైపు శివుడిని చూపించే ఢమరుకం పట్టుకుని ఉండటం చూడొచ్చు. ఇక పవన్ కల్యాణ్ నుంచి వస్తోన్న తొలి పాన్ ఇండియా సినిమా కావడంతో మొదటి సినిమాపై సూపర్ హైప్ క్రియేట్ అవుతోంది. ఇక ట్రైలర్‌కు వస్తున్న స్పందనతో భారీ మొత్తానికి పంపిణీ హక్కులను సొంతం చేసుకునేందుకు డిస్ట్రిబ్యూటర్లు పోటీపడుతున్నట్టు ఇండస్ట్రీ సర్కిల్ సమాచారం.
పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో వస్తోన్న ఈ చిత్రంలో ఇస్మార్ట్ భామ నిధి అగర్వాల్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తుండగా.. బాలీవుడ్ యాక్టర్, దర్శక నిర్మాత అనుపమ్ ఖేర్, బాబీ డియోల్, అర్జున్ రాంపాల్, నర్గీస్ ఫక్రీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని ఏఎం రత్నం సమర్పణలో మేఘ సూర్య ప్రొడక్షన్ బ్యానర్‌పై ఏ దయాకర్‌రావు నిర్మిస్తున్నారు.
Am Ratnam | హరిహర వీరమల్లు నుండి క్రిష్ వెళ్లిపోవడానికి గల కారణం ఇదే.. ఏఎం రత్నం క్లారిటీ
Aamir Khan | ఆమెతోనాకు ఎప్పుడో పెళ్లైపోయింది.. గౌరి స్ప్రాట్‌తో రిలేషన్‌షిప్‌పై ఆమిర్ ఖాన్
War 2 Wrap | ‘వార్ 2’ షూటింగ్ కంప్లీట్.. హృతిక్ రోషన్ ఎమోషనల్ పోస్ట్