Am Ratnam | హరిహర వీరమల్లు నుండి క్రిష్ వెళ్లిపోవడానికి గల కారణం ఇదే.. ఏఎం రత్నం క్లారిటీ
Am Ratnam | పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘హరి హర వీరమల్లు’ . జులై 24న ఈ చిత్రం రావడం పక్కా అని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో ప్రమోషనల్ కార్యక్రమాల విషయంలో స్పీడ్ పెంచాలని మేకర్స్ భావిస్తున్నారు. తాజాగా నిర్మాత ఏ ఎం రత్నం ఓ ఇంటర్వ్యూలో తన మనసులోని విషయాలను వెల్లడించారు.
Am Ratnam | పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘హరి హర వీరమల్లు’ . జులై 24న ఈ చిత్రం రావడం పక్కా అని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో ప్రమోషనల్ కార్యక్రమాల విషయంలో స్పీడ్ పెంచాలని మేకర్స్ భావిస్తున్నారు. తాజాగా నిర్మాత ఏ ఎం రత్నం ఓ ఇంటర్వ్యూలో తన మనసులోని విషయాలను వెల్లడించారు. మా సినిమా దాదాపు 14 సార్లు వాయిదా పడిందంటూ మీడియాలో వార్తలు రావడం చాలా బాధించింది. కోపం కూడా వచ్చింది. నిజానికి మా సినిమా విడుదలను కేవలం మూడు సార్లు మాత్రమే మార్చామన్నారు.
మార్చి 28, మే 9, జూన్ 12 తేదీల్లో విడుదల చేయాలనుకున్నాం. అయితే జూన్ 12న విడుదల చేయలేకపోయినప్పుడు నాకు వ్యక్తిగతంగా ఎంతో బాధేసింది. నా కెరీర్లో ఇప్పటివరకు ఏ సినిమాని కూడా ఒక్కసారి కూడా వాయిదాలేదు అని ఆయన పేర్కొన్నారు. ఈ చిత్రానికి సంబంధించిన గ్రాఫిక్స్ వర్క్ చాలా భారీ స్థాయిలో ఉంది. ‘బాహుబలి’ వంటి సినిమాలు కూడా వీఎఫ్ఎక్స్ పనుల వల్లే ఆలస్యం అయ్యాయి. అలాగే కోవిడ్-19, తర్వాత ఎన్నికల ప్రభావం వల్ల కొంతకాలం షూటింగ్ ఆగిపోయింది. మాకు ఎదురైన ఆలస్యం వెనుక వ్యాపార పరమైన కారణాలు లేవు అని ఏఎం రత్నం తేల్చిచెప్పారు.
పవన్ కల్యాణ్ గారు రాజకీయాలలో కాస్త బిజీగా ఉండటం వలన రిలీజ్ డేట్ విషయంలో పక్కా క్లారిటీ ఇవ్వలేకపోయాం అని ఆయన పేర్కొన్నారు. ఇక ఈ చిత్రాన్ని మొదట క్రిష్ తెరకెక్కించగా, తర్వాత ఏఎం రత్నం దర్శకుడు జ్యోతికృష్ణ డైరెక్ట్ చేశాడు. అయితే ఈ ప్రాజెక్టు నుంచి క్రిష్ వెళ్లిపోవడానికి కారణం, ఆయనకి మరో కమిట్ మెంట్ ఉండటమే అని తెలియజేశారు రత్నం. జ్యోతికృష్ణకి దర్శకత్వ బాధ్యతలని అప్పగించాలని చెప్పింది కూడా పవన్ కళ్యాణ్ గారే. ఇక సినిమా విడుదలకి నాలుగు రోజుల ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేస్తాము. వర్షాలు లేని పక్షంలో తిరుపతిలో చేస్తాము. ఒక వేళ వర్షాలు ఉంటే విజయవాడ ఇండోర్ లో ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాము అని ఏఎం రత్నం తెలియజేశారు. ఈ సినిమా పవన్ కల్యాణ్ స్థాయిని మరో మెట్టు పైకి తీసుకెళ్లడం ఖాయం నమ్మకాన్ని ఏఎం రత్నం వ్యక్తం చేశారు ఏఎం రత్నం.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sand Dumps | రైల్వే పనుల ముసుగులో ఇసుక డంపులు..అక్రమ నిల్వలపై అనుమానాలు
Harish Rao | రైతు వేదికల దగ్గరకు రండి అని రైతులతో ఆటలాడుతున్నారు.. అధికారులపై హరీశ్ రావు ఫైర్
సింగరేణి మండలంలో 500 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు
మొక్కల వెంకటయ్యకు సత్కారం
Gayatri Devi | ఇంద్రకీలాద్రిపై గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గాదేవి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

