Aamir Khan | బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ (Aamir Khan).. ముచ్చటగా మూడోసారి ప్రేమలో పడిన విషయం తెలిసిందే. బెంగళూరు (Bengaluru)కు చెందిన గౌరీ స్ప్రాట్ (Gauri Spratt) అనే మహిళతో కొన్నాళ్లుగా డేటింగ్లో ఉన్నాడు. ఇటీవలే తన 60వ పుట్టినరోజు సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన ఆమిర్.. ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించాడు. తాజాగా గౌరీతో తన రిలేషన్ గురించి ఆమిర్ ఖాన్ కీలక విషయాలు వెల్లడించారు. ఆమెతో తనకు ఎప్పుడో పెళ్లైపోయిందంటూ చెప్పుకొచ్చారు.
‘గౌరీ, నేనూ మా బంధం పట్ల చాలా సీరియస్‌గా ఉన్నాం. చాలా నిబద్ధతతో కూడిన బంధంలో ఉన్నాం. మేము ఇప్పుడు జీవిత భాగస్వాములం. ఇక పెళ్లి గురించి అంటారా.. నా మనసులో నేను ఇప్పటికే ఆమెను వివాహం చేసుకున్నాను. దానిని అధికారికంగా ఎప్పుడు ప్రకటించాలనేదానిపై ముందు ముందు నిర్ణయించుకుంటాం’ అని చెప్పుకొచ్చారు. ఆమిర్ కామెట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
1986లో రీనా దత్తాను పెళ్లి చేసుకున్న ఆమిర్.. 2002లో విడాకులు తీసుకున్నాడు. ఆ తర్వాత బాలీవుడ్ మహిళా డైరెక్టర్ కిరణ్ రావుతో ప్రేమలో పడి.. 2005లో పెళ్లిపీటలెక్కాడు. ఈ జంట కూడా 2021లో విడిపోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం గౌరీతో డేటింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం తన ఆరేళ్ల కొడుకుతో కలిసి గౌరీ బెంగళూరులోనే ఉంటున్నది. ఈమె తల్లి కూడా సెలెబ్రిటీ స్టయిలిస్ట్. వీరికి బెంగళూరు, ముంబయి నగరాల్లో సెలూన్లు ఉన్నాయి. ఏడాదిన్నరగా డేటింగ్లో ఉన్న ఆమిర్ – గౌరీ బంధానికి ఇరు కుటుంబాలు ఓకే చెప్పాయట. దాంతో.. తమ బంధం గురించి బయటపెట్టాడు ఆమిర్. “గౌరీ, నేను పాతికేళ్లుగా స్నేహితులం. ఏడాది కాలంగా ఇద్దరం డేటింగ్లో ఉన్నాం!” అంటూ ఆమిర్ ఇటీవలే వెల్లడించాడు.
Also Read..
Panchayat 5 | పంచాయత్ 5.. కొత్త సీజన్ అనౌన్స్మెంట్ ఇచ్చిన ప్రైమ్ వీడియో
Vidya Balan | జిమ్‌కి వెళ్లడం మానేశాను.. బరువు తగ్గుకుంటూ వచ్చానంటున్న విద్యా బాలన్
8 Vasantalu | ఓటీటీలోకి ‘8 వసంతాలు’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే.!