8 Vasantalu | అనంతిక సనీల్‌కుమార్ (Ananthika Sanilkumar), హనురెడ్డి, రవితేజ దుగ్గిరాల ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘8 వసంతాలు’ (8 Vasantalu). ఈ సినిమాకు ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వం వహించగా.. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై రవిశంకర్ నిర్మించాడు. జూన్ 20న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు తాజాగా ఈ చిత్రం ఓటీటీ అనౌన్స్‌మెంట్‌ను పంచుకుంది. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో ఈ చిత్రం జూలై 11 నుంచి తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ కాబోతుంది.
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. శుద్ధి అయోధ్య (అనంతిక సనీల్ కుమార్) పదిహేడు ఏళ్లకే ఓ పుస్తకం రాసి పేరు తెచ్చుకుంటుంది. అనంతరం కరాటేలో కూడా ప్రావీణ్యం సంపాదిస్తుంది. రచనలు, ట్రావెలింగ్, మార్షల్ ఆర్ట్స్‌తో గడుపుతున్న ఆమె జీవితంలోకి వరుణ్ (హను రెడ్డి) అనే వ్యక్తి ప్రవేశిస్తాడు. దీంతో కొన్నిరోజులకే ఇద్దరు ప్రేమలో పడతారు. శుద్ధికి వరుణ్ ప్రపోజ్ చేయగా.. తనకు సమయం కావాలని కోరుతుంది. ఈ క్రమంలో అతడు విదేశాలకు వెళతాడు. అయితే వరుణ్ విదేశాలకు వెళ్లిపోయిన తర్వాత శుద్ధి జీవితంలోకి సంజయ్ (రవి దుగ్గిరాల) అనే వ్యక్తి ఎంటర్ అవుతాడు. అసలు ఈ సంజయ్ ఎవరు.? శుద్ధి – వరుణ్‌లు కలుస్తారా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
8 vasantalu. Thanu preminchindhi, odipoyindhi… edhigindhi. ❤️
Watch 8 Vasantalu on Netflix, out 11 July in Telugu, Tamil, Kannada and Malayalam#8VasantaluOnNetflix pic.twitter.com/7mPsS6ZITx— Netflix India South (@Netflix_INSouth) July 7, 2025