గాలివాన బీభత్సం
నిజామాబాద్ జిల్లాలోని పలు మండలాల్లో సోమవారం సాయంత్రం గాలివాన బీభత్సం సృష్టించింది. దీంతో చేతికొచ్చే దశలో ఉన్న మక్కజొన్న పంట నేలకొరగగా, వేల్పూర్మండలంలోని పలు గ్రామాల్లో మార్కెట్కు తరలించడానికి సిద్ధంగా ఉంచిన పసుపు, జొన్నలు తడిసిపోయాయి.
- పొతంగల్, ఏర్గట్ల మండలాల్లో నేలవాలిన మక్కజొన్న
- వేల్పూర్ మండలంలో తడిసిన పసుపు
- ఆందోళనలో రైతులు
పొతంగల్/వేల్పూర్/ ఏర్గట్ల, ఫిబ్రవరి 24: నిజామాబాద్ జిల్లాలోని పలు మండలాల్లో సోమవారం సాయంత్రం గాలివాన బీభత్సం సృష్టించింది. దీంతో చేతికొచ్చే దశలో ఉన్న మక్కజొన్న పంట నేలకొరగగా, వేల్పూర్మండలంలోని పలు గ్రామాల్లో మార్కెట్కు తరలించడానికి సిద్ధంగా ఉంచిన పసుపు, జొన్నలు తడిసిపోయాయి. పొతంగల్ మండలంలోని కొడిచర్ల, ఏర్గట్ల మండ లం తొర్తి గ్రామ శివారులో ఉన్న మక్కజొన్న పంటలు నేలకొరిగాయి. మరో 15 నుంచి 20 రోజుల్లో చేతికొచ్చే దశలో ఉన్న పంట గాలివాన బీభత్సానికి వాలిపోయింది.
దీంతో రైతులు తీవ్ర నష్టాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పంటకు విత్తనాలు, ఎరువులు, కూలీలు వంటి భారీ పెట్టుబడి పెట్టిన రైతులు అకాలంగా వచ్చిన గాలులకు పంట నష్టపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట బాగా పండడంతో దిగుబడి వస్తుందన్న ఆశతో ఉన్న రైతులకు.. ఒక్కసారిగా వీచిన గాలి పంటలను దెబ్బతీసింది. అప్పు తెచ్చి పెట్టుబడి పెట్టి నష్టపోయిన తమకు ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. విషయం తెలుసుకున్న పొతంగల్ మండల వ్యవసాయ విస్తరణ అధికారి సుప్రియ నేలకొరిగిన పంటలను పరిశీలించారు. అక్కడున్న రైతులను వివరాలు అడిగి తెలుసుకుని ప్రాథమిక అంచనాగా సుమారు 20 నుంచి 25 ఎకరాల వరకు పంట నష్టం వాటిల్లినట్లు తెలిపారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

