Vidya Balan | సాధారణంగా బరువు తగ్గేందుకు చాలా మంది జిమ్‌కి వెళుతుంటారు. అయితే జమ్కి వెళ్లడం మానేసిన దగ్గర నుండి బరువు తగ్గుతూ వచ్చిందట. ఓ ప్రముఖ హీరోయిన్. ఆమె మరెవరో కాదు బాలీవుడ్ అందాల నటి విద్యా బాలన్. ఆమె పద్మశ్రీ, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు (ఎన్టీఆర్) జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ మరియు ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ చిత్రాలో బసవతారకమ్మ పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులని ఎంతగానో అలరించింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో విద్యా బాలన్ తన శరీర ఆకృతి గురించి మాట్లాడింది. కెరీర్ ఆరంభం నుంచి తాను అనేక విమర్శలు ఎదుర్కొందట. లావుగా ఉన్నావు, ఫిట్‌గా లేవు అనే విమర్శలు తీవ్రంగా ఎదుర్కొన్నట్టు చెప్పింది.
అయితే వాటిని అధిగమించేందుకు కఠినమైన డైట్లు, జిమ్ సెషన్లు ప్రయత్నించిన, ఫలితం కనిపించలేదని పేర్కొంది.అయితే చివరికి చెన్నైకి చెందిన ‘ఆముర్ న్యూట్రిషన్ గ్రూప్’ తో సంప్రదించగా, ఆమెకు బరువు సమస్య ఫాట్ వల్ల కాకుండా శరీరంలో ఏర్పడిన ఇన్ఫ్లమేషన్ వల్ల అని స్పష్టమైందట. వారి సూచనలతో ఏడాది పాటు ఎలాంటి వ్యాయామం లేకుండా కేవలం డైటింగ్ ద్వారా బరువు తగ్గానని విద్యా చెప్పింది. నేనెప్పుడూ లేనంత ఆరోగ్యంగా ఉన్నట్లు భావిస్తున్నాను అంటూ విద్యా బాలన్ చెప్పుకొచ్చింది. అయితే, తను పాటించిన పద్ధతి అందరికీ ఒకే ఫలితాన్ని ఇస్తుందని తాను చెప్పడం లేదని పేర్కొనడం కొసమెరుపు.
2003లో బెంగాలీ చిత్రం ‘భలో థేకో’ ద్వారా సినీరంగ ప్రవేశం చేసిన విద్యా బాలన్, 2005లో ‘పరిణీతా’ సినిమాతో హిందీ చిత్రరంగంలో అడుగుపెట్టింది. తర్వాతి కాలంలో ఆమె నటించిన 40కు పైగా చిత్రాలు మంచి విజయాలు సాధించాయి. 2024లో విడుదలైన హర్రర్ కామెడీ ‘భూల్ భూలయ్యా 3’ లో మంజులికా, మల్లికా అనే రెండు విభిన్న పాత్రలతో ప్రేక్షకుల్ని అలరించింది. విద్యా బాలన్ తన నటనతోనే కాదు, స్పష్టమైన అభిప్రాయాలతో, ఆత్మవిశ్వాసంతో కూడిన వ్యక్తిత్వంతోనూ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తూ ఉంటుంది. 46 ఏళ్ల విద్యా బాలన్ ఆరోగ్యంపై ఆమె తీసుకున్న చొరవ, బాడీ షేమింగ్‌కు ధీటుగా ఇచ్చిన సమాధానం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం.