Panchayat 5 | ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియోలో సూపర్ హిట్ అయిన పాపులర్ వెబ్ సిరీస్ పంచాయత్ తన కొత్త సీజన్‌ను ప్రకటించింది. ఇప్పటికే గత నెల నాలుగో సీజన్‌ను వదిలిన మేకర్స్ తాజాగా ఐదవ సీజన్ అప్డేట్ ఇచ్చారు. ఐదో సీజన్ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని తెలుపుతూ ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’ కొత్త పోస్టర్‌ను పంచుకుంది.
సీజన్4లో ఫులేరా గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సాగగా.. వచ్చే కొత్త ఎలా ఉండబోతుందని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జితేంద్ర కుమార్, నీనా గుప్తా, రఘుబీర్ యాదవ్ తదితరులు ఇందులో కీలక పాత్రల్లో నటించగా.. దీపక్ కుమార్ మిశ్రా, అక్షత్ సంయుక్తంగా తెరకెక్కించారు.
Hi 5 👋 Phulera wapas aane ki taiyyaari shuru kar lijiye 😌#PanchayatOnPrime, New Season, Coming Soon@TheViralFever @StephenPoppins #ChandanKumar @Akshatspyro @uncle_sherry @vijaykoshy @Farjigulzar #RaghubirYadav @Neenagupta001 @malikfeb @chandanroy77 @Sanvikka #DurgeshKumar… pic.twitter.com/59R6Xvj3R1
— prime video IN (@PrimeVideoIN) July 7, 2025