SA vs ZIM : ఈమధ్యే ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ విజేతగా అవతరించిన దక్షిణాఫ్రికా (South Africa) జైత్రయాత్ర కొనసాగుతోంది. లార్డ్స్‌లో ఆస్ట్రేలియాకు షాకిచ్చిన సఫారీలు కొత్త సీజన్లోనూ తమకు తిరుగులేదని చాటుతున్నారు. ఇప్పటికే తొలి టెస్టులో జింబాబ్వే (Zimbabwe)ను చిత్తుచేసిన ప్రొటిస్ జట్టు.. రెండో మ్యాచ్‌లోనూ భారీ విజయం సాధించింది. వియాన్ మల్డర్ (367 నాటౌట్) బ్యాటుతో, బంతితో చెలరేగగా.. ఇన్నింగ్స్ 236 పరుగుల తేడాతో గెలుపొందింది. దాంతో, ఆతిథ్య జట్టు రెండు టెస్టుల సిరీస్‌లో వైట్‌వాష్‌కు గురైంది. పరుగుల పరంగా చూస్తే ఈ 20 ఏళ్లలో జింబాబ్వేకు ఇదే అతిపెద్ద ఓటమి కావడం విశేషం.
సుదీర్ఘ ఫార్మాట్లో దక్షిణాఫ్రికా విజయపరంపర కొనసాగిస్తోంది. జింబాబ్వే పర్యటనలో రికార్డు విజయంతో సిరీస్‌లో ముందంజ వేసిన సఫారీ జట్టు రెండో మ్యాచ్‌లో ఏకపక్షంగా గెలుపొంది క్లీన్‌స్వీప్ చేసింది. రెండు టెస్టుల్లోనూ సమిష్టిగా విఫలమైన జింబాబ్వే భారీ తేడాతో సిరీస్ కోల్పోయింది. బులవాయాలో జరిగిన రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో రికార్డు ట్రిపుల్ సెంచరీతో చెలరేగిన వియాన్ మల్డర్(367 నాటౌట్) జట్టుకు భారీ స్కోర్ అందించాడు. 626 వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన దక్షిణాఫ్రికా కెప్టెన్ నమ్మకాన్ని నిలబెడుతూ బౌలర్లు ప్రత్యర్థి బ్యాటర్ల భరతం పట్టారు.
With the Zimbabwe–South Africa Test ending today, tomorrow will be the first day without Test cricket since June 17.
The 22-day stretch (June 17 – July 8) is the fourth longest streak of consecutive days of Test cricket 😳
(Excluding rest days and no-play days) https://t.co/QBgRsGCdWR
— ESPNcricinfo (@ESPNcricinfo) July 8, 2025
స్పిన్నర్ ప్రెనలెన్ సుబ్రయెన్ ధాటికి జింబాబ్వే 170కే కుప్పకూలి ఫాలో ఆన్ ఆడింది. రెండో ఇన్నింగ్స్‌లో పేసర్ కార్బిన్ బాస్చ్ ఆదిలోనే ఆతిథ్య జట్టును దెబ్బకొట్టాడు. అయితే.. నిక్ వెల్చ్(55), కెప్టెన్ క్రెగ్ ఇర్విన్(49)లు కీలక భాగస్వామ్యంతో జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. కానీ, బాస్చ్ విజృంభణతో జింబాబ్వే వరుసగా వికెట్లు కోల్పోయింది. తనక చివంగను ముత్తుస్వామి ఔట్ చేయడంతో దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ 236 పరుగులతో విక్టరీ కొట్టింది. ఈ సిరీస్‌లో విశేషంగా రాణించిన సఫారీ సారథి మల్డర్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు లభించాయి.