జనగామ చౌరస్తా, మార్చి 10: కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో పం టలు ఎండుతున్నాయని సీపీఎం రా ష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ విమర్శిం చారు. సోమవా రం జనగామ జి ల్లాలోని చిన్నరాంచర్ల, గానుగుపహాడ్, వడ్లకొండలో ఎండిన పం టలను పరిశీలించి మాట్లాడారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వారంలోగా దేవాదుల నీళ్లు అందిం చా లని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం సకాలంలో దేవాదుల ద్వా రా చెరువులు నింపి రైతులకు సాగునీళ్లు అందించి పంటలు ఎండిపోకుండా కాపాడిందని గుర్తుచేశారు.