డోర్నకల్, జనవరి 20 : మహబూబాబాద్ జిల్లా చిల్కోడులోని కృష్ణా ట్రేడర్స్ (ఫర్టిలైజర్)షాపులో చిల్కోడుకు చెందిన పదిమంది రైతులు మిర్చిపంట కోసం ఇండోఫిల్ కంపెనీకి చెందిన ఎలెక్టో మందును కొనుగోలు చేశారు. మందు పిచికారీ చేయగా.. మిర్చి తోటలు దెబ్బతిన్నాయి. దీంతో రైతులు సోమవారం నకిలీ మందు విక్రయించడంతోనే మిర్చి పంట దెబ్బతిన్నదని ఆరోపిస్తూ షాపు ఎదుట ధర్నాచేశారు.
డోర్నకల్ సీఐ రాజేశ్, గార్ల బయ్యారం సీఐ రవికుమార్, ఏవో మురళీమోహన్ చేరుకొని కంపెనీ డీలర్ తిరుపతిని పిలిపించి రైతులు సమక్షంలో మాట్లాడారు. మందును ల్యాబ్ పంపించి పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. పురుగు మందులు విక్రయిస్తున్నా పట్టించుకోని ఏవో మురళీమోహన్ను సస్పెండ్ చేయాలని రైతులు డిమాండ్ చేశారు.