Tragedy | భార్య మీద కోపంతో ఓ భర్త దారుణానికి ఒడిగట్టాడు. తన రెండేళ్ల కూతురికి సపోటా పండులో విషం పెట్టి హత్య చేశాడు. అనంతరం అతనూ ఆత్మహత్య చేసుకున్నాడు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఈ విషాదం చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం లక్హమ్మగూడెం గ్రామానికి చెందిన రవికి కొన్నాళ్ల క్రితం స్వాతికి వివాహమైంది. వీరికి ఇద్దరు కూతుళ్లు మేఘన (2), మయూరి (9నెలలు) ఉన్నారు. భార్యభర్తల మధ్య గొడవల కారణంగా మూడు నెలల క్రితం చిన్న కూతుర్ని తీసుకుని స్వాతి పుట్టింటికి వెళ్లింది. పెద్ద కూతురు మేఘన తండ్రితోనే ఉంటుంది. అయితే పెద్ద కూతుర్ని కూడా తమ వద్దకే పంపాలని స్వాతి ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేసింది. పెద్ద మనుషుల సమక్షంలో దంపతులతో చర్చలు జరిపారు. పరువు పోయిందనే కోపం, కూతురు దూరమవుతుందన్న బాధతో తన పెద్ద కూతురికి సపోటా పండులో ఎలుకలమందు కలిపి ఇచ్చి, తాను కూడా ఎలుకల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు.
ఇది గమనించిన కుటుంసభ్యులు వారిని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ చిన్నారి మృతి చెందింది. రవి పరిస్థితి విషమంగా ఉంది.