నిజాంసాగర్, జూన్12: భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో జీవితంపై విరక్తి చెందిన భర్త తన ఇద్దరు పిల్లలను నీళ్లలో తోసేసి ఆపై తానూ ఆత్మహత్య చేసుకున్న ఘటన కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలో శుక్రవారం చోటుచేసుకున్నది. పోలీసుల కథనం ప్రకారం.. సంగారెడ్డి జిల్లా నిజాంపేటకు చెందిన బోయి కృష్ణ(34), సవితకు కుమారుడు రక్షిత్ (9), కుమార్తె అనన్య (5) ఉన్నారు. నిజాంపేటలో వీరు ఉంటున్న ఇల్లు కూలిపోవడం తో రాంచంద్రాపురానికి వెళ్లిపోయారు. కృష్ణ సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తుండగా, భార్య సవిత టిఫిన్ సెంటర్లో పనిచేస్తున్నది. ఇటీవల భార్యాభర్తల మధ్య మనస్పర్థలు వచ్చి రోజూ గొడవలు జరుగుతుండేవి. జీవితంపై విర క్తి చెందిన కృష్ణ.. గురువారం తన ఇ ద్దరు పిల్లలు రక్షిత్, అనన్యను నిజాంసాగర్ ప్రాజెక్టు వద్ద కు తీసుకొని వెళ్లా డు. ఆ తర్వాత తెప్పపై పిల్లలను కూర్చోబెట్టి ప్రాజెక్టు మధ్యలోకి వెళ్లగానే తోసేశాడు. తానూ ఆత్మహత్య చేసుకుంటున్నట్టు తన అల్లుడు నవీన్‌కు ఫోన్ చేసి, నీటిలో దూకేశాడు. కృష్ణ సోదరుడు సాయిలు ఫిర్యాదుతో శుక్రవారం ఉదయం పోలీసులు గాలించగా ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి.