నిర్మల్ : నిర్మల్ జిల్లాలో( Nirmal Dist) విషాదం చోటు చేసుకుంది. కారు అదుపు తప్పి(Car collides) చెట్టును ఢీ కొట్టిన ఘటనలో తండ్రి,కుమారుడు మృతి(Father and son killed )చెందారు. ఈ విషాదకర సంఘటన నర్సాపూర్(బి) మండలం చాక్పెల్లి గ్రామం వద్ద చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సరేష్(27) అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి బోథ్ మండలం కుచ్లాపూర్ నుంచి లోకేశ్వరం మండలం మన్మద్ వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది.
ఈ ప్రమాదంలో సరేష్, అతడి కుమారుడు దీక్షిత్(7) అక్కడికక్కడే మృతి చెందాడు. సురేష్ భార్య, కుమార్తెకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను హాస్పిటల్కు తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
Speed Post | పోస్టల్ ఉద్యోగుల నిర్లక్ష్యం.. యువకుడికి చేజారిన ఉద్యోగం