నల్లగొండ: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పెద్ద ఆడిషర్లపల్లి మండలం కొనమేకలవారి గూడెం వద్ద బొలెరో వాహనం, బైక్ ఢీకొన్న ఘటనలో బైక్ పై ప్రయాణిస్తున్న తండ్రీ కొడుకులు భాస్కర్(35), అంజి(11) మృతి చెందారు.
తల్లి పరిస్థితి విషమంగా ఉండటంతో.. ఆమెను దేవరకొండ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. మృతులను ఏపీలోని గుంటూరు జిల్లా ముత్యాలమపహాడ్ వాసులుగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.