కామారెడ్డి : కామారెడ్డి జిల్లాలో(Kamareddy district) విషాదం(Tragedy) నెలకొంది. ఇద్దరు పిల్లలను బావిలో (well )తోసివేసి ఓ తండ్రి ఆత్మహత్య (Father and children died)చేసుకున్న విషాదకర సంఘటన తాడ్వాయి మండలం నందివాడ గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన చిట్టెమ్మ శ్రీనివాస్ రెడ్డి(38) తన పిల్లలు విగ్నేష్(6) అనిరుథ్(7)లను బావిలో తోసివేసి ఆపై తాను కూడా అందులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
కుటుంబ కలహాలతో ఇద్దరు పిల్లలను హత్య చేసి తాను ఆత్మహత్య చేసుకున్నట్టుగాపోలీసులు, స్థానికులు భావిస్తున్నారు. బావిలో నీళ్లు అధికంగా ఉండడంతో బురద ఊబిలో శ్రీనివాస్ రెడ్డి మృతదేహం కూరు కుపోయింది. ఇద్దరు పిల్లల మృతదేహాలు బావిలో తేలియాడాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు మరణించడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.