మూసాపేట(అడ్డాకుల) : మహబూబ్ నగర్ ( Mahabubnagar ) జిల్లా దేవరకద్ర నియోజకవర్గం అడ్డాకుల మండలంలోని కందూరు జాతీయ రహదారిపై బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం ( Road Accident ) జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..
కర్నూల్ వైపు నుంచి హైదరాబాద్ ( Hyderabad ) వెళ్లే జాతీయ రహదారి కందూర్ స్టేజీ వద్ద పెద్దవాగుపై ఉన్న వంతెనపై లారీ పక్కనే మరోవైపు స్కూటీ వెళ్తుంది. ఆ సమయంలో వెనుక వైపు నుంచి వేగంగా వచ్చిన డీసీఎం ( DCM ) అధిగమించేందుకు దారి లేక సడన్ బ్రేక్ వేసినట్లు తెలిపారు. వెనుక నుంచి వస్తున్న కారు వేగంగా వచ్చి డీసీఎంను ఢీ కొట్టుకుంది. ఆ కారును అదే వైపున చూస్తున్న లారీ వెనుక వైపు నుంచి ఢీ కొట్టింది. దీంతో డీసీఎం లారీ మధ్యలో కారు మొత్తం నుజ్జు నుజ్జు అయ్యింది.
కారులో ఉన్న ఓ మహిళ శోభారాణి (50) మృతి చెందగా, ఆమె భర్త ఎల్లారెడ్డికి, శోభారాణి తల్లి విమలకు, డ్రైవర్ గాయలైనట్లు తెలిపారు. ముందు ఉన్న డీసీఎం వెళ్లి స్కూటీని ఢీ కొట్టింది. స్కూటీపై ఉన్న రఘుపతి రెడ్డి కూడా గాయాలయ్యాయి. వంతెనపై ప్రమాదం జరగడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.
విషయం స్థానికులు పోలీసుల సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి అడ్డాకుల ఎస్సై శ్రీనివాసులు, మూసాపేట ఎస్సై వేణు సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు ఎల్ అండ్ టి సిబ్బంది, స్థానికులతో పాటు కలిసి అతి కష్టం మీద క్షతగాత్రులను కారులో నుంచి బయటికి తీశారు.
గాయలైన వారిని అంబులెన్స్ లో జిల్లా ఆస్పత్రికి తరలించారు. కారులో వెళ్తున్న వారు వనపర్తి జిల్లా కొత్తకోట మండలం సంకిరెడ్డిపల్లికి చెందిన వారు హైదరాబాద్లో జరుగుతున్న వివాహ వేడుకకు హాజరయ్యేందుకు వెళుతున్నట్లు తెలిపారు. ఇంత క్షతగాత్రుల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.