పెన్‌పహాడ్, ఫిబ్రవరి 11 : మూడ్రోజుల్లో సాగునీ ళ్లు విడుదల చేయకపోతే 3వేల మంది రైతులతో హైదరాబాద్‌లోని గాంధీభవన్‌ను ముట్టడిస్తామని ఎ స్సారెస్పీ ఆయకట్టు రైతులు హెచ్చరించారు. సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్ మండలం చెట్ల ముకుందాపురం, చిన్నగారకుంటతండా, పెద్ద గారకుంటతం డా, జల్మలకుంటతండా, చిన్న సీతారాంతండాలో ఆయకట్టు కింద ఎండిపోతున్న పొలాల్లో నిలబడి మంగళవారం రైతులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ సాగునీటి కోసం జిల్లా మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. వేల ఎకరాల్లో పొలాలు ఎండితున్నా ప్రజాప్రతినిధులకు చీమ కుట్టినట్టు అనిపించడం ఆగ్రహం వ్యక్తంచేశారు. తమ చావులకు జిల్లా మంత్రే బాధ్యత వహించాలని హెచ్చరించారు. విడుతల వారీగా కాకుండా పూర్తిస్థాయిలో నీటిని విడుదల చేయాలని కోరారు. కేసీఆర్ పాలనలో ఏ ఒక్కరోజు కూడా పొలాలు ఎండిపోలేదని తెలిపారు. నిరసన తెలిపిన వారిలో ఓయూ జేఏసీ నాయకుడు మోతీలాల్‌నాయక్, రైతు లు ధరావత్ నగేశ్, ధరావత్ నాగు, ధరావత్ కిషన్, ధరావత్ దాసు, ధరావత్ శ్రీను, పవన్ ఉన్నారు.