తగ్గిన వరి.. పెరిగిన పల్లి

- పంటల మార్పు దిశగా రైతులు
- ఈ ఏడాది భారీగా ఇతర పంటల సాగు
హైదరాబాద్, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో రైతులు పంటల మార్పిడి దిశగా అడుగులు వేస్తున్నారు. సీఎం కేసీఆర్ సూచనలతో వరికి బదులుగా ఇతర పంటల సాగువైపు మళ్లుతున్నారు. దీంతో గత యాసంగి సీజన్తో పోలిస్తే ఈసారి వేరుశనగ, పొద్దుతిరుగుడు, మక్కజొన్న, గోధుమ, పొగాకు, నూనెగింజల సాగు అధికమైంది. రాష్ట్రంలో ఈ నెల మూడో వారం చివరినాటికి రైతులు 10,27,928 ఎకరాల్లో పంటల సాగు చేపట్టినట్టు వ్యవసాయశాఖ వెల్లడించింది. గతేడాది ఇదే సమయానికి రాష్ట్ర రైతులు 7,66,574 ఎకరాల్లో పంటలు వేశారని, ఈసారి సాగు విస్తీర్ణం 2.61 లక్షల ఎకరాలు పెరిగిందని బుధవారం విడుదల చేసిన నివేదికలో స్పష్టం చేసింది. వీటిలో 3,86,008 ఎకరాల్లో పప్పుధాన్యాలు, 3,35,784 ఎకరాల్లో నూనెగింజలు, 2,54,212 ఎకరాల్లో మక్కజొన్న, జొన్న, రాగి, ఎర్రజొన్నలు, ఇతర చిరుధాన్యాలు, 44,589 ఎకరాల్లో వరి, గోధుమ, 44,124 ఎకరాల్లో గడ్డి, గ్రీన్మెన్యూర్, 7,800 ఎకరాల్లో ఇతర వాణిజ్య పంటలు వేసినట్టు వివరించింది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది వరిసాగు భారీస్థాయిలో 91,358 ఎకరాలు తగ్గినట్టు వ్యవసాయ శాఖ వెల్లడించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

