వెల్గటూర్, మార్చి 15 : జగిత్యాల జిల్లా ఎండపల్లి మండల కేంద్రంలో ‘రైతులను వెంటాడుతున్న కరెంటు కష్టాలు’ అనే శీర్షికతో ఈ నెల 14న శుక్రవారం ‘నమస్తే తెలంగాణ’ మెయిన్ ఎడిషన్లో కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. దీనికి విద్యుత్తు శాఖ అధికారులు స్పందించారు. రైతుల సహకారంతో రైతు మిత్ర వాహనంలో జగిత్యాల జిల్లా కేంద్రం నుంచి విద్యుత్తు ట్రాన్స్ఫార్మర్ తీసుకువచ్చి బింగించామని తెలిపారు.
యాసంగి దృష్ట్యా పొలాలు ఎండకుండా తమ సిబ్బంది అన్ని సమయాల్లో రైతులకు అందుబాటులో ఉంటున్నారని రాజారాంపల్లి ఏఈఈ సమ్మయ్య తెలిపారు. ట్రాన్సఫార్మర్పై అధిక లోడ్ పడకుండా రైతులు తమ మోటర్లకు కెపాసిటర్లు బిగించుకోవాలని, మోటర్లను ఎప్పటికప్పుడు సరిచేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.