సిద్దిపేట : కాంగ్రెస్ ప్రభుత్వం రైతులు(Farmers) కన్నెర్రజేస్తున్నారు. కండ్ల ముందే పంటలు(Crops) ఎండిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం కడుపుమండిన రైతన్నలు సాగు నీటికోసం రోడ్డెక్కారు. ఎండిపోతున్న పంటలకు సాగునీరు ఇవ్వాలని సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం ఎల్లాయిపల్లి రైతులు రామునిపట్ల రాజీవ్ రహదారిపై సోమవారం ధర్నా(Dharna) నిర్వహించారు.
ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. రంగనాయక సాగర్, అనంతగిరి రిజర్వాయర్ ఉన్నా సాగునీరు అందడం లేదన్నారు. భూ సేకరణ చేపట్టి పంట పొలాలకు సాగు నీరు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సాగుచేసిన పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొందన్నారు.
అధికారులకు ఎన్నిసార్లు మెరపెట్టుకున్నా కనికరం చూపిస్తలేరని ఆవేదన వ్యక్తం చేశారు. పంటల కోసం పెట్టిన పెట్టుబడులు భారంగా మారా యన్నారు. ఇప్పటికైన ఉన్నతాధికారులు స్పందించి సమస్యను పరిష్కరించి పంట పొలాలలకు సాగు నీరు అందివ్వాలన్నారు.ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు.