Farmers Protest | వ్యవసాయానికి నిరంతరంగా విద్యుత్ సరఫరా చేయాలని రైతుల మహాధర్నా
Farmers Protest | నియోజకవర్గంలోని తిమ్మాజిపేట మండల రైతాంగానికి నిరంతరాయంగా 24 గంటల విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు బుధవారం మహాధర్నా నిర్వహించారు.
నాగర్ కర్నూల్: నియోజకవర్గంలోని తిమ్మాజిపేట మండల రైతాంగానికి నిరంతరాయంగా 24 గంటల విద్యుత్ సరఫరా ( Power Supply ) చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు బుధవారం మహాధర్నా ( Mahadarna ) నిర్వహించారు. ధర్నాలో మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ( Marri Janardhan Reddy ) పాల్గొని సంఘీభావం తెలిపారు. రైతుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఎన్నికల సమయంలో రైతులకు ఎన్నో హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ, అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల సమస్యలకు పరిష్కారం చూపడంలో ఎందుకు విఫలమవుతోందని ప్రశ్నించారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం, క్షేత్రస్థాయిలో ఎందుకు పరిష్కరించడం లేదని నిలదీశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలకు, క్షేత్రస్థాయిలో రైతులు ఎదుర్కొంటున్న పరిస్థితులకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ప్రభుత్వం గుర్తించాలని అన్నారు.
పంటలకు నీరు అందించాల్సిన కీలక సమయంలో విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడితే రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల సమస్యలను కేవలం ప్రకటనలకే పరిమితం చేయకుండా, క్షేత్రస్థాయిలో విద్యుత్ సరఫరాను పర్యవేక్షించి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
కేసీఆర్ నాయకత్వంలోని గత బీఆర్ఎస్ ప్రభుత్వం24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా విధానాన్ని అమలు చేసిందని గుర్తు చేశారు.. రైతుల కష్టాలను ప్రభుత్వం పట్టించుకోకపోతే వారి పక్షాన నిలబడి ప్రజాస్వామ్య పద్ధతుల్లో పోరాటాన్ని కొనసాగిస్తామని తెలిపారు. కార్యక్రమంలో మండలంలోని గ్రామాల రైతులు, బీఆర్ఎస్ నాయకులు, పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Scene | సూర్య ‘సీన్’ సినిమాకు బుకింగ్స్ ఆలస్యం.. విజయ్ ప్రభుత్వం కొత్త జీవో కోసమే ఎదురుచూపులు!
ENE Repeat | మరింత ఫన్తో.. తరుణ్ భాస్కర్ ‘ఈఎన్ఈ రిపీట్’ ట్రైలర్ విడుదల!
AI | ఊపిరితిత్తుల సమస్యలను ఏఐ ముందుగానే గుర్తించగలదు.. వెల్లడించిన నిపుణులు..
Chandrayaan | మందమర్రి టు చందమామ.. నవంబర్ 13న థియేటర్లలోకి ‘చంద్రయాన్’ నవ్వుల రాకెట్!
బడిలో మద్యం సేవిస్తూ పట్టుబడ్డ హెడ్మాస్టర్ : వీడియో
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

