నేడు టీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులతో పాటు అన్ని వర్గాలు అభివృద్ధి చెందుతున్నాయి. వీరంతా కేసీఆర్కు రుణపడి ఉంటారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి మనల్ని ఎంతో మంది పాలించారు. ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి.. పోయాయి. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ రైతును రాజు చేసేందుకు కృషి చేస్తున్నారు. రైతుకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నరు. గత ప్రభుత్వాల హయాంలో ఎంతో మంది రైతులు ప్రాణాలు పోగోట్టుకున్నారు. గతంలో కరెంట్ షాక్తో చనిపోయిన రైతుల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడం లేదు. రైతుకు ఎంతో న్యాయం జరిగింది. రైతుబంధుతో పాటు రైతు బీమా పథకం అమలు చేయడం గొప్ప విషయం. గుంట భూమి ఉన్న రైతుకు కూడా బీమా సౌకర్యం కల్పించడం గొప్ప విషయం. వ్యవసాయ ఆధారిత కుటుంబాలు గొప్పగా బతుకుతున్నాయి. సమానత్వానికి దళిత బంధు పథకం నిదర్శనం. మరో అంబేద్కర్ కేసీఆర్.. ఈ పథకం దళితుల అభివృద్ధికి ఎంతో దోహదపడుతుంది. దళిత వర్గాలు కేసీఆర్కు రుణపడి ఉంటాయి.
– చందుపట్ల నర్సింహారెడ్డి ( కమలాపూర్ మండలం )
దళిత బంధు పథకం అమలు కోసం మరో రూ. 500 కోట్లు విడుదల చేసినందుకు సీఎం కేసీఆర్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. నిధుల విడుదలతో అందరి నోళ్లు మూతపడ్డాయి. ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ ఆధ్వర్యంలో దళితులందరూ కూడా సంబురాలు చేసుకుంటున్నారు. ప్రతి ఒక్క దళిత కుటుంబానికి రూ. 10 లక్షలు అందుతాయి. దళితుల పక్షాన సీఎం కేసీఆర్కు మరోసారి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.
-బత్తుల సత్తయ్య ( ఎస్డబ్ల్యూ కాలనీ, హుజూరాబాద్ టౌన్ )