నల్లగొండ జిల్లా చండూరు మండలం బంగారిగడ్డ కాటన్ మిల్లులోని సీసీఐ కేంద్రంలో పత్తి కొనుగోళ్లను నిలిపివేయడంతో గురువారం రైతులు ఆందోళనకు దిగారు. దళారుల నుంచి కొనుగోలు చేయడానికే తమ నుంచి పత్తి కొనడం లేదంటూ రైతులు మిల్లు ఎదుట నిరసనకు దిగారు.
సూర్యాపేట జిల్లా మోతె మండలం రావిపహాడ్లో నిర్మిస్తున్న ఇథనాల్ కంపెనీ ఎదుట పలు గ్రామాల ప్రజలు, నాయకులు చేస్తున్న రిలే నిరాహార దీక్షలను గురువారం పోలీసులు భగ్నం చేశారు. ఈ సందర్భంగా పోలీసులు, స్థానికుల మధ్య తోపులాట జరగడంతో పలువురు నాయకులను అరెస్టు చేశారు.
పూర్తిస్థాయిలో ప్రొఫెసర్లను నియమించి, సౌకర్యాలన్నీ కల్పించాలని డిమాండ్ చేస్తూ గురువారం కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని మెడికల్ కళాశాల ఎదుట వైద్య విద్యార్థులు ధర్నా నిర్వహించారు. కనీస వసతులు కల్పించలేదంటూ ఆందోళనకు దిగారు.